• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా అక్షర రూపానికి విజువల్...

నా అక్షర రూపానికి విజువల్ ని ఇచ్చారు.. చైతన్య సిన్సియర్ ఎఫర్ట్ ఇది..!

| ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2025-02-15 15:49 GMT

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతున్న తండేల్ సినిమా సక్సెస్ గురించి చిత్ర దర్శకుడు చందూ మొండేటి మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.


అల్లు అర్జున్ సిగ్నేచర్ కోసం మొదలైయిందని విన్నాం ?

పాక్ జైలులో అల్లు అర్జున్ గారి ఫ్యాన్. వాళ్ళు మన తెలుగు సినిమాలు బాగా చూస్తారు. 22 మంది మత్స్యకారులు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.

ఇది బయోపిక్ అనుకోవచ్చా ?

లేదండీ. వాస్తవిక సంఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ. ఇందులో ఇన్సిడెంట్ వాస్తవం. మత్య్సలేశ్యం నుంచి గుజరాత్ వెళ్ళడం అక్కడ నుంచి పాక్ సరిహద్దుల్లో దొరకడం, వారి కోసం పోరాటం.. ఇదంతా వాస్తవం. దానికి ఒక అందమైన ప్రేమకథ అల్లాం. అందుకే రియల్ పేర్లు పెట్టలేదని అన్నారు చందు మొండేటి.

మొదట ఈ కథ విన్నప్పుడు పాక్ నేపధ్యంలో చేద్దామని అనుకున్నాను. కానీ అలోచించగా చూస్తే ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్ వుంది. ఈ ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం. ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని కమ్యునికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి. ఈ పాయింట్ నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. అందుకే మెదట నుంచి ఈ సినిమా మేము ఎమోషనల్ లవ్ స్టొరీ అనే ప్రమోట్ చేశాం. ఇది ప్యూర్ లవ్ స్టొరీ అని చందు మొండేటి అన్నారు.

పాక్ జైలు ఎపిసోడ్స్ ట్రిమ్ చేశారా..?

ఈ సినిమా ఎంతసేపు చెబితే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే అంశంపై మా టీం అంతా చాలా క్లారిటీగా ఉన్నాం. కొంతమంది ఆడియన్స్ పాక్ ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ని ఎక్స్ ప్రెస్ చేశారు. ప్రతి ఎలిమెంట్ కి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారని అన్నారు చందు.

చైతు గారితో తెనాలి రామకృష్ణుడు బయోపిక్ ఎనౌన్స్ చేశారు కదా.. ఏఎన్ఆర్ క్యారెక్టర్ కి చైతు సరిపోతారని ఎప్పుడు అనిపించింది ?

చైతు గారు చాలా సిన్సియర్. ఆయన సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టారు కాబట్టే తండేల్ సక్సెస్ కి మించినన ప్రశంసలు ఆయన నటనకి వస్తున్నాయి. తెనాలి రామకృష్ణుడు క్యారెక్టర్ లో కూడా ఆయన అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వగలరు. అలాంటి సినిమా ఆయన చేయాలని దర్శకుడిగా స్నేహితుడిగా నా కోరిక అదే అని అన్నారు చందు మొండేటి.

తండేల్ లో చైతు గారి ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా వుండేది ?

ఇందులో ప్రతి షాట్ నా బ్రెయిన్ లో వుంది. ప్రతిది ఓ కొలమానంలోనే చేశాను. పెళ్లి కార్డ్ సీన్ లో కేవలం అతనికి మాత్రమే తెలిసేలా కళ్ళని చూపించాం. అక్కడ నుంచి ప్రతి షాట్ డిజైన్ చేశాం. ఆ సీన్ కి థియేటర్ మొత్తం ఊగిపోయిందని అన్నారు.

పాక్ ఎపిసోడ్స్ కి సెన్సార్ సమస్యలు వచ్చాయా?

చాలా వచ్చాయి. గ్లింప్స్ లో జెండా చూపించడానికే ఒప్పుకోలేదు. డైలాగ్స్, మ్యుట్స్, విజువల్ కట్స్ చాలా వున్నాయి. ముఫ్ఫై శాతం ఎమోషన్ సెన్సార్ కారణంగా తగ్గింది. అయితే అది వారి డ్యూటీ. మా వరకు మా బెస్ట్ ఇచ్చాం అన్నారు చందు మొండేటి.

అమరన్ తర్వాత సాయి పల్లవి పాత్రలో ఏమైనా మార్పులు చేశారా ?

లేదండీ, అప్పటికే షూటింగ్ అయిపోయింది. అయితే అమరన్ లో సాయి పల్లవిని చూసిన తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చిందని అన్నారు.

మీ డైరెక్షన్ లో నాగచైతన్య గారి ఫస్ట్ వందకోట్ల సినిమా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది ?

ఇది గీతా ఆర్ట్స్. అరవింద్ గారు, వాసు గారు, చైతు గారు, దేవిశ్రీ .. ఇలా అంతా కలసి చేసిన కొలాబరేట్ ఎఫర్ట్. నా అక్షర రూపానికి వారంతా విజువల్ ని ఇచ్చారు. చైతు గారికి నేను అంటే చాలా ఇష్టం. మా మధ్య చాలా మంచి స్నేహం వుంది.

నాగార్జున గారు ఈ సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేయడం ఎలా అనిపించింది ?

నాగార్జున గారు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశారు. ఆయన 'థాంక్ యూ చందు. వి లవ్ యూ'అని చెప్పడం ఆయన గొప్పదనం. అది నాకు గొప్ప ప్రశంస. ఈ సినిమా ఒక గౌరవం తీసుకొస్తుందని ముందు నుంచి నమ్మాం. ప్రేక్షకులు అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని ఇచ్భారని అన్నారు చందు మొండేటి.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి..?

ఈ కథని దేవిశ్రీ అర్ధం చేసుకున్నట్లుగా ఎవరూ అర్ధం చేసుకోలేదు. ప్రతి సీన్ మ్యూజిక్ ని ఆయన ముందే ఊహించుకున్నారు. కథలోని ప్రతి ఎమోషన్ పై ఆయనకి పట్టువుంది. పాటలల్ని ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. నేపధ్యం సంగీతంతో ఆద్యంతం కట్టిపడేశారని అన్నారు.

సినిమా పైరసీ బారిన పడినప్పుడు ఎలా ఫీలయ్యారు..?

గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది. ఆ బాధ మాటల్లో చెప్పలేను. సినిమాని ఒక థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీస్తాం. అలాంటిది పైరసీ బారిన పడటం చాలా బాధాకరం. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపొయినంత బాధగా ఉటుంది. చాలా పెయిన్ ఫుల్ అని చందు అన్నారు.

గీతా ఆర్ట్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

పెంటాస్టిక్ ఎక్స్ పీరియన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అరవింద్ గారు లేకుండా ఎలా వుంటుంది? కథలో ప్రశ్నలు వేసే వారు ఎవరని ఫీలయ్యాను. మా మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని అన్నారు.

ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి..?

చాలామంది దర్శకులు, హీరోలు కాల్ చేశారు. నాని, రామ్ కాల్ చేసిన డబుల్ బ్లాక్ బస్టర్ .. ఎలా వుంది ఫీలింగ్ అన్నారు. ఇది ఒక దర్శకుడి సినిమా అని రాఘవేంద్రరావు గారు చెప్పడం వెరీ మెమరబుల్ అని చందు అన్నారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి..?

కార్తికేయ3 వుటుంది. మధ్యలో ఓ సినిమా వుంది. సూర్య గారితో చర్చలు జరుగుతున్నాయి. అది వర్క్ అవుట్ అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు చందు మొండేటి

Tags:    
  • Thandel 
  • NagaChaitanya 
  • SaiPallavi 
  • ChandooMondeti 
  • Success 
  • Boxoffice 
  • Rs100crores 
  • Censorship 
  • Emotionalconnection 
  • Nani 
  • Ram 
  • DeviSriPrasad 
  • GeethaArts2 
  • BunnyVasu 
  • AlluAravind 
  • Nagarjuna 
  • RaghavendraRao 
  • Blockbuster 
  • Lovestory 
  • Directorinsights 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS