• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రతినిధి-2 చూసి ఓటేయండి:...

ప్రతినిధి-2 చూసి ఓటేయండి: చంద్రబాబు

| ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ఒకటైన నారా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక వ్యక్తి నారా రోహిత్.

By - Tupaki Desk
Update: 2024-05-09 06:21 GMT

ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ఒకటైన నారా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక వ్యక్తి నారా రోహిత్. 2018లో విడుదలైన వీర భోగ వసంతరాయలు సినిమా తర్వాత నారా రోహిత్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో ఫలానా మూవీ చేస్తారని వార్తలు వచ్చినా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి సీక్వెల్ తో వస్తున్నారు.

ఇప్పటికే ప్రతినిధి-2 సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యమంత్రిని ఎందుకు చంపావంటూ మొదలైన ట్రైలర్ లో నారా రోహిత్ ను మొదట ఒక జర్నలిస్టుగా మేకర్స్ చూపించారు. ఆ తర్వాత సరికొత్త గెటప్ లో వృద్ధుడిగా కనిపించారు.

రిలీజ్ ట్రైలర్ లో 'పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్', 'దేశాన్ని కాపాడటానికి ఒక సైనికుడు.. కడుపు నింపడానికి ఒక రైతు ఎంత ఇంపార్టెంటో సొసైటీకి జర్నలిస్టు కూడా అంతే ఇంపార్టెంట్' అంటూ వ‌చ్చిన డైలాగులు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెస్ట్ విషెస్ తెలిపారు. ఎన్నికల బిజీలో ఉన్న ఆయన.. ప్రతినిధి-2 గ్లింప్స్ ని చూశారు.

ఆ తర్వాత సినిమాతో పాటు ఓటు ప్రాముఖ్యత కోసం మాట్లాడారు. 'ప్రతినిధి-2.. మూర్తి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సినిమాను తీసుకొస్తున్నారు. మంచి పార్టీ చేతిలో, మంచి నాయకుల చేతిలో మీ ఓటును పెట్టుబడిగా పెట్టగలిగితే అది మీ జీవితాలను మార్చేసింది. ఓటును చాలా తేలికగా తీసుకుంటున్నారు. కానీ ఓటు వల్లే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. అందుకే ఓటు ముఖ్యం. ఓటు వేయకపోవడం దేశ ద్రోహం. ఓటు వేయడం మీ బాధ్యత' అని సీబీఎన్ తెలిపారు.

'ప్రతినిధి-2 సినిమా చూడండి. ఆ మూవీ ద్వారా చైతన్యవంతులు అవ్వండి. మే13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోండి' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే నారా రోహిత్.. చంద్రబాబు సోదరుడి కుమారుడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు తెరకెక్కిస్తున్నారు. మే10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Thank you, Peddhanaanna, for the appreciation for #Prathinidhi2. Thank you for reiterating the value of the VOTE. @ncbn @murthyscribe pic.twitter.com/UpAOiKsEwT

— Rohith Nara (@IamRohithNara) May 9, 2024
Tags:    
  • Prathinidhi2 
  • Trailer 
  • Chandrababunaidu 
  • APelections 
  • Tdp 
  • Nararohit 
  • Murthydevagupthapu 
  • Vote 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS