'శంభాల' టీమ్ 'కరికాల'.. గ్లామరస్ బ్యూటీ ఎంట్రీ ప్లస్సే!

ఇప్పుడు ఆ సినిమాలో సందీప్ కిషన్‌ కు జోడీగా కేథరిన్ థ్రెసా నటించనున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఆమెకు వెల్కమ్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌ ను విడుదల చేసింది.

Update: 2026-10-10 11:12 GMT

సినిమాలో కథ ఎంత ముఖ్యమో.. దానికి తగ్గ అట్రాక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫాంటసీ మూవీల్లో కొత్త వరల్డ్స్ ను చూపించడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న కరికాల మూవీ టీమ్ అలాంటి ప్రయత్నమే చేస్తోంది. ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అవ్వగా, రీసెంట్ గా ఆ సినిమాలోకి గ్లామరస్ బ్యూటీ కేథరిన్ థ్రెసా ఎంట్రీ ఇచ్చారు.

శంబాల సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు యుగంధర్ ముని ఇప్పుడు కరికాలతో మరోసారి తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు కలిసి ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌ పై రూపొందుతున్న ఆ సినిమాను నార్మల్ స్టోరీతో కాకుండా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై హైప్ పెంచాయి.

ఇప్పుడు ఆ సినిమాలో సందీప్ కిషన్‌ కు జోడీగా కేథరిన్ థ్రెసా నటించనున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఆమెకు వెల్కమ్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌ ను విడుదల చేసింది. సందీప్ కిషన్, కేథరిన్ కలిసి నటించడం ఇదే మొదటిసారి. దీంతో వీరిద్దరి జోడీ స్క్రీన్ పై ఎలా ఉంటుందనే ఇంట్రెస్ట్ మొదలైంది. అయితే సినిమాలో కేథరిన్ రోల్ ఎలా ఉండబోతోంది, కథలో ఆమెకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది ఇంకా తెలియదు.

అయితే కేథరిన్‌ కు గ్లామర్ రోల్స్ కొత్తేమీ కాదు. గతంలోనూ ఆమె తన అందంతో పాటు యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందుకే కరికాలలో ఆమె ఎంట్రీ సినిమాకు ఎక్స్ ట్రా అట్రాక్షన్ గా మారే ఛాన్స్ ఉంది. అయితే గ్లామర్‌ కే పరిమితం కాకుండా స్టోరీలో ఆమె రోల్ కు ఇంపార్టెన్స్ ఉంటే సినిమాకు మరింత యూజ్ అవుతుంది. ఫాంటసీ వరల్డ్ లో సాగే కథలకు కొత్త రోల్స్, వాటి వెనుక ఉండే సీక్రెట్స్ కూడా ఇంట్రెస్ట్ పెంచుతాయి.

ఇక కరికాల మూవీని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఫస్ట్ పార్టును 2027 జూలై 2న, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంటే రెండు భాగాల మధ్య దాదాపు నాలుగు నెలల గ్యాప్ మాత్రమే ఉంటుంది. కథపై నమ్మకంతోనే అలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ రేంజ్ టెక్నాలిజీ, మోడ్రన్ విజువల్ ఎఫెక్ట్స్‌ తో కరికాల చిత్రాన్ని రూపొందించాలని టీమ్ భావిస్తోంది.

శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నా, ఆ రేంజ్ కు తగ్గ రిజల్ట్ రావాలంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆడియన్స్ ను ఫుల్ గా మెప్పించాలి. మరి కరికాల మూవీ ఎలా ఉంటుందో.. బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News