పవన్ కోసం బన్నీ 'గ్లాసు' ప్రచారం.. వార్నర్ సూపర్ రిప్లై!

దీంతో పవర్ స్టార్ కు తన ఫుల్ సపోర్ట్ ను బన్నీ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది.

Update: 2024-05-02 16:16 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ నుంచి రిలీజైన టైటిల్ సాంగ్ ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ సాంగ్ తో సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు మేకర్స్. పుష్ప పుష్ప.. అంటూ సాగే సాంగ్ తో పవర్ స్టార్ కు పరీక్షంగా సపోర్ట్ ఇచ్చారు బన్నీ. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుతో టీ తాగుతూ సాంగ్ లో రచ్చ రచ్చ చేశారు అల్లు అర్జున్. టీలో బిస్కెట్ ముంచుకుని తింటూ సందడి చేశారు.

సాంగ్ లో గాజు గ్లాసు క్లోజ్ షాట్స్ ఎక్కువగా వాడారు పుష్ప-2 మేకర్స్. దీంతో పవర్ స్టార్ కు తన ఫుల్ సపోర్ట్ ను బన్నీ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. గాజు గ్లాస్ షాట్స్ కావాలనే ఎక్కువగా మేకర్స్ పెట్టారని, ఎన్నికల ముందు కావాలనే సాంగ్ రిలీజ్ చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేస్తుండగా.. బన్నీ కూడా ఇప్పుడు తోడు అయ్యారన్నమాట!

గతంలో పవర్ స్టార్ అభిమానులకు, బన్నీ ఫ్యాన్స్ కు గట్టిగా వార్ జరిగేది. బన్నీ సరైనోడు మూవీ ఈవెంట్ లో అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' వ్యాఖ్య అప్పట్లో సంచలనం రేపింది. అయితే అల్లు అర్జున్ అవసరమైనప్పుడు మాత్రం పవన్ కు సపోర్ట్ చేస్తుంటారు. ఓ సారి పవన్ తన తల్లిని కొందరు దూషించిన విషయంలో నిరసన వ్యక్తం చేయగా బన్నీ మద్దతు పలికారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయంలో బన్నీ గాజు గ్లాసుతో ప్రమోట్ చేయడం గమనార్హం.

Read more!

పుష్ప 2 స్టెప్‌ పై వార్నర్‌ కామెంట్!

మరోవైపు, బన్నీ హుక్ స్టెప్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే పుష్ప మూవీ రీల్స్‌ చేసి సినీ ప్రియుల మనసులు దోచుకున్న ఆసీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. అల్లు అర్జున్ పోస్ట్ పై స్పందించారు. ‘ఈ స్టెప్ ఎంత బాగుందో.. ఇప్పుడు నాకు మళ్ళీ పని పడింది. దీన్ని నేర్చుకోవాలి’ అని వార్నర్ కామెంట్ పెట్టారు. ఆ తర్వాత బన్నీ కూడా.. ‘ఇది చాలా ఈజీ. ఈసారి మనం కలిసినప్పుడు నేను నేర్పిస్తాను’ అని రిప్లై ఇచ్చారు.

ఇక బన్నీ ఫ్యాన్స్ కూడా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘వార్నర్‌ భాయ్ మీరు ఈ స్టెప్‌ ఎప్పుడు వేస్తారు?’, ‘మీకు ఇది చాలా సింపుల్‌ కదా బ్రో’ అని అంటున్నారు. చెప్పాలంటే.. డేవిడ్ వార్నర్ ప్రతిసారీ గ్రౌండ్ లో టాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. గతంలో ఓ సారి మైదానంలో పుష్ప-1 సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కు డ్యాన్స్ చేసి ఆడియన్స్ లో జోష్ నింపారు. తగ్గేదేలే అంటూ ఓ రేంజ్ లో సందడి చేశారు. మరి వార్నర్.. ఈ కొత్త హుక్ స్టెప్ ఎప్పుడు వేస్తారో చూడాలి.

Tags:    

Similar News