వైరల్ కంటెంట్ & స్పీచ్.. అల్లు బాస్ కోసం బన్నీ వాసు ఏమన్నారంటే?
బన్నీ వాసు మైక్ తీసుకుని మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. అక్కడ ఉన్న మరో నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. వాసు గారు ఇంకొక అగ్రెసివ్ స్పీచ్ ఇస్తారని తెలిపారు.;
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ బాధ్యతలను చూసుకుంటున్నారు. వివిధ సినిమాలు నిర్మిస్తూ.. సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. రీసెంట్ గా తన సొంత బ్యానర్ ను కూడా స్టార్ట్ చేసిన ఆయన.. మిత్రమండలి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మూవీపై సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ క్యాంపయిన్ గురించి మాట్లాడారు. కాస్త ఆగ్రహంతో కొన్ని పదాలు కూడా ఉపయోగించారు. దీంతో ఆయన స్పీచ్ ఫుల్ వైరల్ గా మారింది. నిజానికి ఎప్పుడూ కూల్ గా ఉండే బన్నీ వాసు.. ఆ రోజు మాత్రం తట్టుకోలేక మాట్లాడినట్లు ఉన్నారు. కానీ పలు విమర్శలు ఎదుర్కొన్నారు.
రీసెంట్ గా అల్లు అరవింద్.. బన్నీ వాసు మిత్రమండలి ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే ఆ విషయాన్ని ఆయనే తాజాగా వెల్లడించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం జరగ్గా.. బన్నీ వాసు విచ్చేశారు. ఆ సమయంలో వేదికపై మాట్లాడారు.
బన్నీ వాసు మైక్ తీసుకుని మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. అక్కడ ఉన్న మరో నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. వాసు గారు ఇంకొక అగ్రెసివ్ స్పీచ్ ఇస్తారని తెలిపారు. దీంతో వెంటనే బన్నీ వాసు.. కాంట్రవర్సీలు పూర్తిగా లేవని తెలిపారు. వెరీ కూల్ అని అన్నారు. ఆ కాంట్రవర్సీలో అల్లు అరవింద్ తో చాలా తిట్లు తిన్నానని పేర్కొన్నారు.
ఆ తిట్లు తన తండ్రితో కూడా ఎప్పుడూ తినలేదని అన్నారు. అందుకే ఈరోజు జాగ్రత్తగా, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడతానని తెలిపారు. అందుకే టైట్ షర్ట్ కూడా వేసుకొచ్చానని చెబుతూ నవ్వించారు. అయితే వేదికపై ఉన్న అల్లు అరవింద్.. బన్నీ వాసుతో ఏదైనా వైరల్ కంటెంట్ ఇవ్వు అంటూ సరదాగా రిక్వెస్ట్ చేశారు.
దీంతో బన్నీ వాసు.. వైరల్ కంటెంట్ ఇవ్వమంటారని , కానీ మళ్లీ ఆయనే వైర్ పట్టుకుని కొడతారని అన్నారు. దీంతో మొత్తం ఒక్కసారిగా నవ్వేశారు. మరో నాలుగైదు నెలలు వైరల్ కంటెంట్ ఏమీ ఇవ్వనని తెలిపారు. కేవలం వైరల్ ఫీవర్స్ ఈ మధ్య వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం బన్నీ వాసు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. మొత్తానికి బన్నీ వాసు, అరవింద్ కామిక్ టైమింగ్ బాగుందని నెటిజన్లు చెబుతున్నారు.