కొత్త జనరేషన్ కనిపెట్టిన బన్నీ వాసు.. నేనూ ఆ బ్యాచ్ వాడినే అంటూ!
బన్నీ వాసు.. నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తూ.. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు.;
బన్నీ వాసు.. నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తూ.. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. బన్నీవాసుకు అటు మెగా ఫ్యామిలీతో ఇటు అల్లు ఫ్యామిలీతో ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో బన్నీ వాసు కీలక పాత్ర పోషిస్తున్నారు. అల్లు అరవింద్ తో కలిసి పదుల సంఖ్యలో సినిమాలు నిర్మించారు. అయితే అలాంటి బన్నీ వాసు తాజాగా ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ కొత్త జనరేషన్ ని కనిపెట్టారు.. మరి ఇంతకీ ఈ కొత్తరకం జనరేషన్ సంగతి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
తాజాగా బన్నీ వాసు 90's మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లిటిల్ హార్ట్స్ మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. "చాలామంది నన్ను GenZ, Gen Alpha గురించి అడుగుతూ.. మీరే జనరేషన్ సార్ ? అని అడుగుతుంటారు. దానికి నేను 'ఉల్ఫా జనరేషన్ ' సార్ అని చెప్పాను. అదేంటి ఉల్ఫా జనరేషన్? అంటే ఏంటి?అని వాళ్ళు నన్ను తిరిగి ప్రశ్నించగా.. ఈ ఉల్ఫా జనరేషన్ అంటే ఇంట్లో క్యారేజ్ తీసుకొని.. కాలేజ్ బ్యాగులో పెట్టుకొని.. కాలేజీకి వెళ్లకుండా ఊరంతా తిరిగే వారిని ఉల్ఫా జనరేషన్" అంటారు.
"అయితే అప్పట్లో అలాంటి జనరేషన్ కి లీడర్ ని పెడితే కచ్చితంగా నేనే లీడర్ ని అయ్యేవాడిని. అలాంటి ఉల్ఫా జనరేషన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. అయితే ఉల్ఫా జనరేషన్ అనేది ప్రతి జనరేషన్ లో ఉంటుంది. కానీ ఇలాంటి క్యారెక్టర్ లో నువ్వు చాలా అద్భుతంగా నటించావు. నాకు అర్థం అవ్వడం లేదు నువ్వు ఉల్ఫానా.. లేక మంచి స్టూడెంట్ వా అనేది. నిన్ను చూసినంత సేపు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారు. ఎందుకంటే నేను చదువుకున్న సమయంలో టెన్త్ 86%,ఇంటర్మీడియట్ 91% కానీ సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి 37%. అలా ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్ కి వచ్చే వరకు వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది? అనేది మొత్తం సినిమాలో చూపించారు".
"నేను చదువుకునే రోజుల్లో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లి లైన్ ఎక్కువ ఉందని థియేటర్ కి వెళ్లి సినిమా చూసాను. అయితే నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి ఉల్ఫా గాళ్లు ప్రతి జనరేషన్ లో ఉంటారా అనిపించింది" అంటూ లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్లో మౌళి తనూజ్ ప్రశాంత్ యాక్టింగ్ ని మెచ్చుకుంటూ బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం బన్నీ వాసు మాట్లాడిన మాటలు విన్న చాలా మంది నెటిజన్లు బన్నీ వాసు GenZ, Gen Alpha కాకుండా Gen Ulpha అంటూ కొత్తరకం జనరేషన్ ని కనిపెట్టాడు. ఆయన కూడా ఆ జనరేషన్ కి చెందిన వాడే అని చెప్పుకున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక లిటిల్ హార్ట్స్ మూవీ లో మౌళి యాక్టింగ్ తో ఇరగదీసారని బన్నీ వాసు మాటలతో అర్థం అవుతోంది