• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిల్లలకు 'బుజ్జి'ని కలిసే...

పిల్లలకు 'బుజ్జి'ని కలిసే అవకాశం..!

| ఇప్పుడు మరోసారి కల్కి బుజ్జీ కారును వార్తల్లోకి స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు తీసుకు రావడం జరిగింది.

By - Tupaki Desk
Update: 2024-11-13 09:30 GMT

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా ఏస్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్న కల్కి సినిమాలో ప్రభాస్ వినియోగించిన కారు బుజ్జీ అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. రాబోయే కాలంలో కార్లు అదే విధంగా ఉండబోతున్నాయా, కావాల్సినప్పుడు ఎగిరే అవకాశం ఉంటుందా అంటూ ఫ్యూచర్‌ ని కళ్ల ముందు ఉంచే విధంగా బుజ్జీ కారును డిజైన్‌ చేయడం జరిగింది. ప్రముఖులు సైతం బుజ్జి కారు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఏదో డమ్మీ కాకుండా నిజంగా కారును రెడీ చేసి సినిమాలో వాడటం జరిగింది.

సినిమాలో బుజ్జి కారు కనిపించేది కొద్ది సమయం అయినా సినిమా విడుదల ముందు చేసిన హడావిడి కారణంగా బాగా పబ్లిసిటీ దక్కింది. బుజ్జి కారు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా చేశారు. బుజ్జీ కారు సినిమా విడుదల తర్వాత కూడా మాట్లాడుకునే విధంగా మేకర్స్ ఏదో ఒక విధంగా ఆ కారును వార్తల్లో ఉంచుతున్నారు. ఇప్పుడు మరోసారి కల్కి బుజ్జీ కారును వార్తల్లోకి స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు తీసుకు రావడం జరిగింది. చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడుతున్న బుజ్జి కారును వారి వద్దకు తీసుకు వెళ్లాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకోసం ప్రసాద్‌ మల్టీప్లెక్స్ ను వేదికగా ఎంపిక చేసుకున్నారు.

కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి కారును పిల్లల దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 14న ప్రసాద్‌ ఐమాక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచబోతున్నారు. పిల్లలకు బుజ్జి ని కలిసే అవకాశంను కల్పిస్తారు. పెద్ద ఎత్తున వచ్చే పిల్ల కోసం బుజ్జి చూసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రత్యేక రోజున పిల్లల కోసం కారును తీసుకు రావడం మంచి నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా విడుదల తర్వాత ఇలాంటివి చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా సినిమా గురించి మరింత చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.

సూపర్‌ హిట్‌ అయిన కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్‌ రాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగ్‌ అశ్విన్‌ ప్రకటించాడు. ఈ గ్యాప్‌లో ఎలాంటి సినిమాను చేసే ఉద్దేశ్యం లేదని, త్వరలోనే కల్కి 2 సినిమాను పట్టాలెక్కిస్తామని ప్రకటించాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. మహాభారతం నేపథ్యంలో కల్కి 2 సినిమా ఉంటుందని, ప్రభాస్‌, కమల్‌ హాసన్‌ల పాత్రలు ఎక్కువగా ఉండే విధంగా సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. మరి సెకండ్‌ పార్ట్‌లో బుజ్జి కారు ఉంటుందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • Bujjicar 
  • Kalki2898AD 
  • Prabhas 
  • Nagashwin 
  • Prasadsimax 
  • Childrensday 
  • Students 
  • Kalkibujji 
  • Vyjayanthimovies 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS