'పెద్ది' యాస కోసం యూట్యూబర్ సాయం!

అందుకే మూవీ ఫస్ట్ గ్లింప్స్ లో రామ్ చరణ్ విజయనగరం యాసలో డైలాగ్స్ చెబుతూ కనిపించిన విషయం తెలిసిందే.;

Update: 2025-08-21 08:02 GMT

డెబ్యూ మూవీ ఉప్పెనతో రూ.100 కోట్లు హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా.. ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్ తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ లో రెండో మూవీనే చరణ్ తో చేసే అద్భుతమైన అవకాశాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు పెద్ది మూవీ విషయంలో ఓ రేంజ్ లో ముందుకెళ్తున్నారని చెప్పాలి.

గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీగా పెద్దిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. అనుకున్నట్లు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేస్తున్న బుచ్చిబాబు.. పెద్ది సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా తనదైన రీతిలో టాలెంట్, తన మార్క్ చూపిస్తున్నారు.

ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తో రానున్న పెద్ది మూవీలో నెవ్వర్ బిఫోర్ అనేలా చరణ్ ను సినిమాలో చూపించనున్న బుచ్చిబాబు.. హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. పెద్ది మూవీ కథ విజయనగరంలోని గ్రామీణ ప్రాంతాల చుట్టూ తిరుగనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అందుకే మూవీ ఫస్ట్ గ్లింప్స్ లో రామ్ చరణ్ విజయనగరం యాసలో డైలాగ్స్ చెబుతూ కనిపించిన విషయం తెలిసిందే. అందుకే విజయనగరం మాండలికం కోసం ఇన్‌ పుట్‌ లు తీసుకోవడానికి బుచ్చిబాబు.. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఫిల్మీమోజీని సంప్రదించారట. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బుచ్చిబాబు సంప్రదించిన విషయాన్ని ఫిల్మీమోజీ టీమ్ మెంబర్ సాయికిరణ్.. ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఫిల్మీమోజీలో తన పనికి ముగ్ధుడైన తర్వాత బుచ్చిబాబు తనను సంప్రదించారని వెల్లడించారు. పెద్దికి డైలాగ్స్ రాయడంలో సహాయం చేయడానికి బుచ్చిబాబు తనకు అవకాశం కూడా ఇచ్చారని సాయి పేర్కొన్నారు.

అయితే ఫిల్మీమోజీతో తనకు కొనసాగుతున్న కమిట్మెంట్ల కారణంగా, ఆ ఆఫర్‌ ను యాక్సెప్ట్ చేయలేదని, కానీ కొన్ని డైలాగ్స్ కోసం హెల్ప్ చేశానని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అది తెలిసి నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. సినిమాను ప్రామాణికంగా నిర్మించడానికి బుచ్చిబాబు నిబద్ధతను రామ్ చరణ్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

అదే సమయంలో ఫిల్మీమోజీ ఛానెల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మిడిల్ క్లాస్ మధు పేరుతో క్రియేట్ చేసిన రోల్ వేరే లెవెల్. వారి వీడియోస్ ఎప్పుడు వస్తాయోనని అంతా వెయిట్ చేస్తుంటారు. ప్రతీ వీడియో కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. కాబట్టి ఆ టీమ్ మెంబర్ రాసిన డైలాగ్స్ కచ్చితంగా మూవీకి సెట్ అవుతాయనే చెప్పాలి!

Tags:    

Similar News