'F1 ది మూవీ' తెలుగులో రీచ్ ఎంత‌?

ఫార్ములా వ‌న్ రేసింగ్ అంటే గ‌గుర్పాటుకు గురి చేసే సాహ‌స‌ విన్యాసాల‌తో ర‌క్తి క‌ట్టిస్తుంది.;

Update: 2025-06-20 00:30 GMT

ఫార్ములా వ‌న్ రేసింగ్ అంటే గ‌గుర్పాటుకు గురి చేసే సాహ‌స‌ విన్యాసాల‌తో ర‌క్తి క‌ట్టిస్తుంది. అలాంటి ఫాస్ట్ ఫేసింగ్్ క‌థ‌నంతో సినిమా చూడాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలి. రెప్ప పాటులో యాక్సిడెంట్లు, ర‌య్ మ‌ని దూసుకుపోయే రేస‌ర్లను చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వు. ఇక అలాంటి క‌థ‌లో డ్రామాను జోడించి ఉత్కంఠభ‌రితంగా చూపిస్తే దానికి ఆద‌ర‌ణ కూడా ద‌క్కుతుంది. హాలీవుడ్ సూప‌ర్ స్టార్ బ్రాడ్ పిట్ స్పోర్ట్స్ డ్రామా `F1 ది మూవీ` విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. బ్రాడ్ అభిమానుల్లో ఉత్సాహం అంత‌కంత‌కు రెట్టింప‌వుతోంది.

ప్రముఖ మూవీ రివ్యూ సైట్, రాటెన్ టొమాటోస్ టొమాటోమీటర్‌లో దీనికి 87 శాతం బలమైన స్కోర్‌ను ఇవ్వ‌డంతో దీనిని థియేట‌ర్ల‌లో చూడాల‌న్న ఆస‌క్తి పెరిగింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా భార‌త‌దేశంలో అన్ని మెట్రోల్లోను విడుద‌ల‌వుతోంది. జూన్ 27న విడుదల కానున్న ఈ చిత్రం ప్రివ్యూలు చూసిన విమర్శకులు దీనిని `హై-ఆక్టేన్ క్రౌడ్ ప్లెజర్` అని అభివర్ణించారు.

టామ్ క్రూజ్ టాప్ గన్: మావెరిక్ ఫేం, ద‌ర్శ‌క‌నిర్మాత‌ జోసెఫ్ కోసిన్స్కీ దర్శకత్వం వహించిన F1 ది మూవీలో కొన్ని ఎగ్జ‌యిట్ చేసే యాక్షన్ సన్నివేశాలు, ప్రమాదకరమైన విన్యాసాలు ర‌క్తి క‌ట్టించాయ‌ని స‌మీక్ష‌కులు రాసారు. రేసింగ్ స్టోరీని ఉత్కంఠ భ‌రితంగా తెర‌పై చూపించార‌ని ఇప్ప‌టికే స‌మీక్ష‌కులు చెప్పారు. కొన్ని నెగెటివ్ స‌మీక్ష‌లు కూడా దీనిపై ఉన్నాయి. బ్రాడ్ పిట్ , జేవియర్ బార్డెమ్ వంటి టాప్ స్టార్లు ఈ చిత్రంలో న‌టించారు. స్పోర్ట్స్ డ్రామాలో బ్రాడ్ పిట్ న్యూయార్క్ నగరానికి చెందిన ఫార్ములా వన్ డ్రైవర్ సోనీ హేస్ పాత్రను పోషించాడు. అతడు భయంకరమైన ప్రమాదం తర్వాత రేసింగ్‌ను విడిచిపెడ‌తాడు. ఫార్ములా వన్ నుండి బలవంతంగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అత‌డు ఏ కార‌ణంతో తిరిగి వెన‌క్కి వ‌స్తాడు? అన్న‌ది తెర‌పై చూడాలి.

Tags:    

Similar News