• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ తరహాలోనే...

త్రివిక్రమ్ తరహాలోనే ఆమెతో బోయపాటి

| ముఖ్యంగా తమ సినిమాల్లో నటించే హీరోయిన్ల విషయంలోనూ సెంటిమెంట్ చూస్తుంటారు అలాంటి వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-17 10:41 GMT

మిగిలిన అన్ని రంగాలతో పోల్చుకుంటే సినిమాల్లో మాత్రం ఇంకాస్త ఎక్కువగా సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ప్రాజెక్టును ప్రకటించే సమయం నుంచి రిలీజ్ డేట్ వరకు.. సినిమాకు పెట్టే కాస్ట్ నుంచి కాస్టింగ్ వరకూ అన్నీ గతంలో కలిసి వచ్చిన ప్రకారమే ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా తమ సినిమాల్లో నటించే హీరోయిన్ల విషయంలోనూ సెంటిమెంట్ చూస్తుంటారు. అలాంటి వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

వాస్తవానికి చాలా మంది డైరెక్టర్లు తమ సినిమాల్లో గతంలో చేసిన హీరోయిన్‌ను రిపీట్ చేయరు. కానీ, టాలీవుడ్‌లోని కొందరు దర్శకులు హీరోయిన్ల ఎంపికతో హిట్ సెంటిమెంట్‌ను ముడి వేస్తుంటారు. అలాంటి వారిలో బడా డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన తర్వాత ఆయన చాలా మంది కథానాయికలను మళ్లీ మళ్లీ తన సినిమాలో నటింపజేసి హైలైట్ అయ్యారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘జల్సా’ సినిమాలో ఇలియానాను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇది హిట్ కావడంతో ఆ తర్వాత ‘జులాయి’కి కూడా ఆమెను ఫీమేల్ లీడ్‌గా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సమంత రూత్ ప్రభును హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇది బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’ సినిమాల్లో నటింపజేశారు. తద్వారా ఆమె మళ్లీ మళ్లీ హిట్లను అందుకున్నారు.

ఇదే త్రివిక్రమ్ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం కోసం పూజా హెగ్డేను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ‘అల.. వైకుంఠపురములో’ మూవీకి కూడా తీసుకున్నారు. అనంతరం ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా ఆమెను తీసుకున్నా.. కొన్ని కారణాలతో శ్రీలీలతో రీప్లేస్ చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్‌లా బోయపాటి శ్రీను కూడా అదే తరహా సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో సరిగా హిట్లను అందుకోలేకపోతోన్న బోయపాటి శ్రీను ‘అఖండ’తో సత్తా చాటారు. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ను ప్రకటించారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నారు. గతంలో ఆమె ‘జయ జానకీ నాయక’ చిత్రంలోనూ మెరిసింది. అలా బోయపాటి.. ప్రగ్యా జైస్వాల్‌కు మూడో ఆఫర్‌ను ఇచ్చినట్లు అయింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘అఖండ 2’ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకోవడం గమనించిన వాళ్లంతా త్రివిక్రమ్ బాటలోనే బోయపాటి శ్రీను కూడా నడుస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇది సెంటిమెంట్ ట్రెండ్‌ కాకపోవచ్చు. మొదటి పార్ట్ లో చేసిన రోల్ సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. అయితే ఆమెకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు ఏమి లేవు. సీక్వెల్ అయినా ఈ మధ్య హీరోయిన్స్ ను పెద్దగా రిపీట్ చేయడం. కానీ బోయపాటి ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Tags:    
  • Boyapatisrinu 
  • Trivikram 
  • Akhanda2 
  • Pragyajaishwal 
  • Actress 
  • Poojahegde 
  • Samantha 
  • Akhanda 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS