3000 కోట్లు.. ఆదిత్య ధర్ కు అసలైన చిక్కే
రణవీర్ సింగ్ తో ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' సిరీస్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రెండు పార్టులు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3100 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేశాయి.
రణవీర్ సింగ్ తో ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' సిరీస్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రెండు పార్టులు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3100 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేశాయి. ఇంతటి భారీ సక్సెస్ ఏ దర్శకుడికైనా గొప్ప కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. చూడటానికి ఇది గొప్ప విషయమే అయినా, వాస్తవానికి ఈ రికార్డులే ఇప్పుడు ఆదిత్యకు ఓ పెద్ద వలగా మారాయని చెప్పొచ్చు.
ఒకసారి 3000 కోట్ల మార్క్ టచ్ చేసిన తర్వాత జనాల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. నెక్స్ట్ తీయబోయే సినిమా మీద ఆటోమెటిక్ గా అదే రేంజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ మార్క్ ను దాటకపోయినా కనీసం దానికి దగ్గరగా అయినా వెళ్లాలనే ప్రెజర్ సదరు డైరెక్టర్ మీద పడుతుంది. ఇక్కడే అసలైన ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని ఫ్రీగా కథ రాసుకోవడం అనేది మామూలు విషయం కాదు.
ఉదాహరణకు ఆదిత్య తన నెక్స్ట్ సినిమా కోసం ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకుని, అది బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేసింది అనుకున్నా కూడా.. సాధారణంగా వెయ్యి కోట్లు అంటే ఏ మేకర్ కైనా లైఫ్ టైమ్ డ్రీమ్. కానీ ముందే 3100 కోట్లు చూసిన కళ్లకు ఆ వెయ్యి కోట్లు చాలా తక్కువగా కనిపిస్తాయి. సినిమా కమర్షియల్ గా హిట్ అయినా సరే, సోషల్ మీడియాలో అండర్ పెర్ఫార్మెన్స్ అనే ముద్ర వేసేస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో తర్వాతి ప్రాజెక్ట్ ఎంచుకోవడం మామూలు టాస్క్ కాదు. దీనికి తోడు ఏ స్టార్ తో సినిమాను పట్టాలెక్కించాలనేది ఇంకో ప్రధానమైన సమస్యగా మారుతుంది. మళ్లీ అదే స్థాయిలో వందల కోట్లు పెట్టి భారీ యాక్షన్ సినిమా చేయాలా, లేక ప్రశాంతంగా వేరే జోనర్ లో ప్రయోగాలు చేయాలా అన్నది పెద్ద కన్ఫ్యూజన్. ప్రయోగాలు చేస్తే కచ్చితంగా కలెక్షన్స్ తగ్గుతాయి. అలాగని మళ్లీ సేఫ్ గేమ్ ఆడితే రొటీన్ అనే కామెంట్స్ వస్తాయి. క్రియేటివిటీకి, మార్కెట్ కు మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం.
ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత వచ్చే ఒత్తిడిని డీల్ చేయడమే డైరెక్టర్ కు ఎదురయ్యే అసలైన చాలెంజ్. గతంలో బాహుబలి తర్వాత రాజమౌళి, కేజీయఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ లాంటి వాళ్లు ఇలాంటి ఒత్తిడిని ఫేస్ చేసి సక్సెస్ ట్రాక్ ను కొనసాగించారు. ఇప్పుడు ఆదిత్య ధర్ ముందు కూడా అలాంటి చాలెంజ్ ఉంది. ఫ్యాన్స్ పెట్టుకునే హోప్స్ ను మ్యాచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
అందుకే ప్రొడక్షన్ హౌస్ లు బ్లాంక్ చెక్ లు ఆఫర్ చేస్తున్నా కూడా ఈ దర్శకుడు తొందరపడి మాట ఇవ్వడం లేదు. కంటెంట్ మీద నమ్మకంతో తనకి నచ్చినట్లు సెట్ చేసుకుంటాడా లేక మార్కెట్ లెక్కల భయంతో వెనకడుగు వేస్తాడా అన్నది మరో డౌట్. ఏదేమైనా ఆ భారీ రికార్డ్ భారాన్ని మోస్తూ నెక్స్ట్ సినిమాతో థియేటర్లలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.