అప్పుడు హీరోయిన్స్‌, ఇప్పుడు హీరోలు... పీఆర్‌ టీమ్స్‌ రచ్చ

ఇండస్ట్రీ ఏదైనా పోటీ అనేది కామన్‌. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు అన్ని ఇండస్ట్రీలోనూ ఘర్షణ వాతావరణం ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీలోనూ ఉంటుంది.

Update: 2026-07-23 07:01 GMT

ఇండస్ట్రీ ఏదైనా పోటీ అనేది కామన్‌. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు అన్ని ఇండస్ట్రీలోనూ ఘర్షణ వాతావరణం ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీలోనూ ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఘర్షణ వాతావరణం పైకి కనిపించదు అంతే. కానీ లోపల చాలా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో హిట్‌ కొట్టాడు అంటే మరో హీరో ఆ హీరోను మించిన హిట్‌ కొట్టాలని ప్రయత్నించడం ఇండస్ట్రీలో సర్వసాదారణం. అయితే ఈ మధ్య కాలంలో హీరోల పీఆర్‌లు సోషల్‌ మీడియాలో చేస్తున్న రచ్చ కారణంగా మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి తలెత్తింది. ఒక హీరో పీఆర్‌ టీం మరో హీరోపై విమర్శలు చేయడం, సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ ప్రచారం చేయడం అనేది కామన్‌ అయింది. ముఖ్యంగా యంగ్‌ హీరోల మధ్య ఈ వ్యవహారం ఎక్కువగా ఉంది అనేది ఇండస్ట్రీ వర్గాల వారి మాట.

టాలీవుడ్‌ హీరోల విషయంలో...

టాలీవుడ్‌లో ఈ చెత్త సంస్కృతి పెద్దగా లేదని చెప్పాలి. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ పీఆర్‌ గేమ్‌ కాస్త ఎక్కువగానే ఉంది. మొన్నటి వరకు హీరోయిన్స్‌ ఒకరిపై ఒకరు సోషల్‌ మీడియాలో పీఆర్‌ టీం ద్వారా దుమ్మెత్తుకు పోసుకున్నారు. ఇప్పుడు హీరోల వంతు వచ్చింది అన్నట్లుగా పరిస్థితి మారింది. బాలీవుడ్‌లో ఇద్దరు యంగ్‌ హీరోలు పైకి చూస్తే బాగానే ఉన్నారు అనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం చాలా పెద్ద కోల్డ్‌ వార్‌ జరుగుతుంది. వారి ప్రమేయం లేకుండా పీఆర్ టీమ్స్‌ సోషల్‌ మీడియాలో నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారు అంటే నమ్మే పరిస్థితి లేదు. కచ్చితంగా ఆయా హీరోలు తమ ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఎదుటి హీరో క్రేజ్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనేది బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. సీనియర్‌ హీరోల మధ్య సైతం పోటీ ఉండేది, కానీ ఇలాంటి చెత్త రాజకీయాలు వారు చేయక పోయేవారు అనేది సీనియర్‌ మీడియా పర్సన్స్‌ మాట.

బాలీవుడ్‌లో పీఆర్‌ గేమ్స్‌...

బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఆ ఇద్దరు హీరోలు కార్తీక్‌ ఆర్యన్‌, ఆయుష్మాన్‌ ఖరానా. ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో సమ ఉజ్జీలుగా ముందుకు సాగుతున్నారు. కంటెంట్‌ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ యూత్‌ ఆడియన్స్‌ను అలరించే విధంగా సినిమాలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని మెప్పిస్తూ వీరు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలుగా ఎదుగుతున్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరి మధ్య పీఆర్ టీమ్స్‌ చిచ్చు రాజేశాయా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఒక హీరో సినిమా విడుదల అయిన సమయంలో సోషల్‌ మీడియాలో తీవ్రమైన విమర్శలు చేస్తూ పోస్ట్‌లు, ఆర్టికల్స్ ప్రచురితం అయ్యాయి. ఆ విమర్శలు మరో హీరో చేయించి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఇద్దరు హీరోల పీఆర్‌ టీంలు చాలా యాక్టివ్‌గా సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు దాడికి తెగ బడుతున్నాయి.

ఆయుష్మాన్‌ ఖురానా, కార్తీక్‌ ఆర్యన్‌...

ఈ వ్యవహారం వ్యక్తిగత హననం వరకు వస్తుంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పీఆర్‌ అస్సలు కరెక్ట్‌ కాదని బాలీవుడ్‌ వర్గాల వారు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు త్వరలో ఒక ప్రాజెక్ట్‌లో కలిసి నటించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో పీఆర్‌ టీమ్స్ ఇలా చేస్తే వారు కలిసి ఎలా నటిస్తారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ పీఆర్‌ వెనుక ఉన్నది హీరోలు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ వివాదం రోజు రోజుకు సోషల్‌ మీడియాలో ముదురుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఆ ఇద్దరు హీరోలు స్పందించాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కార్తీక్‌ ఆర్యన్‌, ఆయుష్మాన్‌ ఖారానా మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. అసలు తమకు సంబంధం లేని విషయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటిది కరెక్ట్‌ కాదని, హీరోయిన్స్‌ మధ్య జరిగిన ఈ పీఆర్‌ రచ్చ హీరోలకు మారడం ఆందోళన కలిగించే విషయం అని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Tags:    

Similar News