త‌వ్వ‌కాలు జ‌రిపి మ‌రీ చీవాట్లు పెడుతున్నారే!

మన దేశానికి మతపరమైన గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకో అది పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.;

Update: 2026-01-24 06:08 GMT

ఏ. ఆర్. రెహ‌మాన్ వివాదం ఇటీవ‌ల ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వేడి చ‌ల్లారు తుంద‌నుకుంటే? బాలీవుడ్ న‌టీమ‌ణులు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు త‌వ్వి తీయ‌డంతో? వాళ్లు టార్గెట్ అవుతున్నారు. ఇప్ప‌టికే విద్యాబాల‌న్ పాత వీడియో తో అడ్డంగా దొరికిపోయింది.`అన్‌ఫిల్టర్డ్ బై సమ్దిష్` అనే పాడ్‌కాస్ట్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో భారత్ మతపరంగా విడిపోయిందనే వ్యాఖ్య‌లు కాక‌పుట్టించాయి. మన దేశానికి మతపరమైన గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకో అది పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.

తాను వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక వ్యక్తి అయినప్పటికీ, మతపరమైన కట్టడాలు గుడులు, మసీదులు వంటి నిర్మాణానికి విరాళాలు ఇవ్వనని స్పష్టం చేశారు. `ఎవరైనా హాస్పిటల్, స్కూల్ లేదా టాయిలెట్లు కడతామంటే సంతోషంగా విరాళం ఇస్తాను కానీ, మతపరమైన సంస్థలకు ఇవ్వన‌ని క‌రాఖండీగా చెప్పేసారు. ఈ వ్యాఖ్య‌ల‌తో నెట్టింట జ‌నాలు రెండు వ‌ర్గాలుగా వీడిపోయి త‌న్నుకున్నారు. విద్యాబాల‌న్ కు వ్య‌తిరేకంగా కొంద‌రు మాట్లాడితే? ఆమెను స‌మ‌ర్దిస్తూ మ‌రికొంత మంది మాట్లాడారు. ఆ వీడియో అప్ప‌ట్లో పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది.

తాజాగా కియారా అద్వానీ కూడా ఓ పాత వీడియోతో అడ్డంగా దొరికింది. ఆ వీడియోలో కియారా అద్వానీ `భారతదేశంలో బీఫ్ (గోమాంసం) పోర్క్ (పంది మాంసం) నిషేధించిన తర్వాత దేశం స్వేచ్ఛను కోల్పోయిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. భారతదేశం మొత్తం మీద బీఫ్ ఎప్పుడూ నిషేధించబడలేదని, సరైన అవగాహన లేకుండా మాట్లాడొదంటూ క్లాస్ పీకుతున్నారు. ఎలాంటి బాధ్య‌త లేకుండా నోటి కొచ్చిన‌ట్లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దేశానికే ప్ర‌మాద‌క‌రం అంటూ హెచ్చ‌రించారు.

ఇప్పుడీ పాత వీడియో అకస్మాత్తుగా వెలుగులోకి రావడంతో కియారా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. విద్యా బాలన్ ఎదుర్కొన్న విధంగానే ఆమె కూడా నెట్టింట భారీ స్థాయిలో వ్యతిరేకతను మూట గట్టుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నెటి జ‌నులు భార‌త్ కు వ్య‌తిరేకంగా చేసిన ఇంకా చాలా మంది సెల‌బ్రిటీల వీడియోలు త‌వ్వి తీసే ప‌నిలో ఉన్నారు. మ‌రి ఇంకెంత‌మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.

అమీర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా దేశంపై నోరు జారిన సంద‌ర్బాలున్నాయి. అమీర్ ఖాన్ విష‌యంలో ఓసారి ఏకంగా అత‌డు హీరోగా న‌టించిన సినిమానే బుక్ అయింది. బోయ్ కాట్ ట్రెండ్ తో సినిమాకు తీవ్ర‌న‌ష్టం వాటిల్లింది. దీంతో అమీర్ ఖాన్ దిగొచ్చి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసాడు.

Tags:    

Similar News