• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ ప్రేమ కథల టైం...

మళ్లీ ప్రేమ కథల టైం వచ్చిందేమో..!

| బాలీవుడ్‌లో దశాబ్దం ముందు వరుకు ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. అలా వచ్చిన ప్రేమ కథలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి.

By - Tupaki Desk
Update: 2025-06-10 07:06 GMT

రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పినట్లుగా ఒకప్పుడు బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌తో పాటు మరికొందరు సీనియర్‌ హీరోలు యంగ్‌ ఏజ్‌లో చేసిన యాక్షన్, మాస్ మసాలా సినిమాలు అద్భతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాస్ మసాలా సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలో మ్యూజిక్ కంపెనీలు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి సంగీత నేపథ్యంలో సినిమాలను రూపొందించారు. దాంతో బాలీవుడ్‌లో యాక్షన్‌ సినిమాల లోటు మొదలైంది. బాలీవుడ్‌లో రూపొంది సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలను సౌత్‌లో చిరంజీవి, రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోలు రీమేక్‌ చేసి సూపర్‌ స్టార్‌లు అయ్యారని వర్మ పేర్కొన్నాడు.

బాలీవుడ్‌లో దశాబ్దం ముందు వరుకు ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. అలా వచ్చిన ప్రేమ కథలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. షారుఖ్‌ ఖాన్‌తో పాటు, సల్మాన్‌, అమీర్‌ ఖాన్‌లు సైతం ప్రేమ కథా చిత్రాల వల్లే స్టార్స్‌గా నిలిచారు. లవ్‌ స్టోరీ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలోనే స్పై థ్రిల్లర్ జోరు మొదలు అయ్యాయి. చాలా సినిమాలు అదే జోనర్‌లో వచ్చి హిట్‌గా నిలిచాయి. వందల కోట్ల వసూళ్లను సాధించాయి. కానీ గత కొన్నాళ్లుగా స్పై థ్రిల్లర్‌లకు ఆధరణ తగ్గుతూ వస్తుంది. ప్రతి సినిమాలోనూ అదే నేపథ్యం ఉంటున్న కారణంగా ప్రేక్షకులు విసుగు చెంది పోయారు. అవసరమా అన్నట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో వచ్చిన వార్‌, పటాన్‌తో పాటు మరికొన్ని స్పై థ్రిల్లర్స్ అదే కథ, అదే నేపథ్యంతో వచ్చిన నేపథ్యంలో ముందు ముందు రాబోతున్న స్పై సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. టైగర్‌ సినిమాతో హిట్‌ కొట్టిన సల్మాన్‌ ఆ తర్వాత స్పై థ్రిల్లర్‌లను చేసినా ఆకట్టుకోలేక పోయాడు. అదే ఫార్ములా ఇతర హీరోలకు ముందు ముందు వర్తించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే బాలీవుడ్‌లో స్పై థ్రిల్లర్స్‌ను మానేసి మాస్‌ మసాలా సినిమాలతో పాటు ప్రముఖంగా లవ్‌ స్టోరీ సినిమాలు చేస్తే బాగుంటుందని ఒక వర్గం ఫిల్మ్‌ మేకర్స్ భావిస్తున్నారు. మెల్ల మెల్లగా ప్రేక్షకులను ఆ జోనర్‌కి అలవాటు చేయాలని భావిస్తున్నారు.

జనరేషన్‌లు మారుతున్నా కొద్ది ఫిల్మ్‌ మేకింగ్‌ విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే బాలీవుడ్‌లో కొత్త వారు మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వారిని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎంకరేజ్ చేయాల్సి ఉంది. పెద్ద నిర్మాతలు అలాంటి సినిమాలను తీస్తేనే బాలీవుడ్‌లో మార్పు వస్తుంది. కరోనా సమయం నుంచి బాలీవుడ్‌లో సక్సెస్‌ రేటు దారుణంగా పడి పోయింది. కనీసం అయిదు నుంచి పది శాతం కూడా సక్సెస్ రేటు నమోదు కావడం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే బాలీవుడ్‌లో కూడా సౌత్‌లో మాదిరిగా అన్ని రకాల సినిమాలను తీస్తూ ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Tags:    
  • BollywoodTrends 
  • SpyThrillerFatigue 
  • MassMasalaCinema 
  • LoveStories 
  • RGVOpinion 
  • SouthInfluence 
  • BollywoodReform 
  • HindiCinemaCrisis 
  • PostCovidBollywood 
  • FilmmakingEvolution 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS