తెలుగు స్టార్ డైరెక్టర్ పై సల్మాన్ గురి..!

పాన్ ఇండియా సినిమాలతో మన తెలుగు స్టార్స్ చేస్తున్న బాక్సాఫీస్ బీభత్సాన్ని చూసి బాలీవుడ్ స్టార్స్ అంతా షాక్ అవుతున్నారు.;

Update: 2025-12-01 05:30 GMT

పాన్ ఇండియా సినిమాలతో మన తెలుగు స్టార్స్ చేస్తున్న బాక్సాఫీస్ బీభత్సాన్ని చూసి బాలీవుడ్ స్టార్స్ అంతా షాక్ అవుతున్నారు. బాలీవుడ్ ని పూర్తిగా డామినేట్ చేసిన సౌత్ సినిమాలను చూసి బడా స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు. అందుకే బీ టౌన్ స్టార్స్ కూడా సౌత్ డైరెక్టర్స్ తో పనిచేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ కొందరు ఆ ప్రయత్నాలు చేసి సక్సెస్ అవగా మరికొందరు ఆ అటెంప్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ సౌత్ డైరెక్టర్స్ తో పనిచేసిన స్టార్స్ మళ్లీ మళ్లీ వారితోనే పనిచేయాలని చూస్తున్నారు.

మరో సౌత్ డైరెక్టర్ తో సల్మాన్ ఖాన్..

ముఖ్యంగా ప్రస్తుతం బాలీవుడ్ లో అసలేమాత్రం టైం కలిసి రాని కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో సౌత్ డైరెక్టర్ తో పనిచేయబోతున్నాడు. అది కూడా తెలుగు దర్శకుడితో సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మురుగదాస్ తో సల్మాన్ ఖాన్ చేసిన సికిందర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఐతే ఈసారి గురి తప్పకూడదనే ఉద్దేశ్యంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సల్మాన్ ఖాన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి సినిమాను ఎస్.వి.సీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది. 18 ఏళ్ల కెరీర్ లో 6 సినిమాలు మాత్రమే చేసిన వంశీ పైడిపల్లి రెండేళ్ల క్రితం దళపతి విజయ్ తో వారిసు సినిమా చేశాడు. ఐతే ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా సౌత్ డైరెక్టర్స్ తో ముఖ్యంగా తెలుగు దర్శకుడితో పనిచేయాలని కొన్నాళ్లుగా ఆసక్తి చూపిస్తున్నారు.

వంశీ పైడిపల్లి మూడు నాలుగేళ్లకు ఒక సినిమా..

ఈ క్రమంలో తప్పకుండా సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది. తెలుగులో స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ ఉన్న వంశీ పైడిపల్లి మూడు నాలుగేళ్లకు ఒక సినిమా చేసినా అది సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తారు. మహర్షి తర్వాత వారిసు కోసం గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి సల్మాన్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ తో ఉన్నారు. 2026 సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

తెలుగు డైరెక్టర్ కాబట్టి సల్మాన్ ఖాన్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. ఎలాగు నిర్మాత దిల్ రాజు కాబట్టి తెలుగు వెర్షన్ రెడీ చేయడం పెద్ద కష్టమేమి కాదు. తెలుగు స్టార్స్ తో కూడా మంచి రిలేషన్ ఉన్న సల్మాన్ ఖాన్ టాలీవుడ్ డైరెక్టర్ తో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నానికి కోపరేషన్ దక్కుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News