టాలీవుడ్ కి పోటీగా రంగంలోకి ఖాన్ త్రయం!
టాలీవుడ్ కి పోటీగా బాలీవుడ్ నుంచి ఖాన్ త్రయం రంగం సిద్దం చేస్తోందా? టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్ ను ఢీకొట్టేందుకు బాలీవుడ్ పావులు కదుపుతోందా? అంటే అవుననే తెలుస్తోంది.;
టాలీవుడ్ కి పోటీగా బాలీవుడ్ నుంచి ఖాన్ త్రయం రంగం సిద్దం చేస్తోందా? టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్ ను ఢీకొట్టేందుకు బాలీవుడ్ పావులు కదుపుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. తెలుగు సినిమా నేడు పాన్ ఇండియాలో ఓ సంచలనమని చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే నార్త్ బెల్ట్ నుంచి వసూళ్లు లెక్క ఎంత అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మారుతుంది.
'బాహుబలి', 'సాహో', 'ఆర్ ఆర్ ఆర్' , 'పుష్ప2' లాంటి చిత్రాలు హిందీ మార్కెట్ లో సాధించిన వసూళ్లతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా 'పుష్ప2' తో బన్నీ ఏకంగా హిందీ హీరోల రికార్డులే తిరగ రాసాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ కొత్త చరిత్రను రాసాడు. అప్పటి నుంచి బాలీవుడ్ హీరోలు మరింత సీరియస్గా పని చేయడం మొదలు పెట్టారు. సౌత్ దర్శకులతో బాలీవుడ్ హీరోలు పనిచేయడానికి ముందుకు రావడం. రాజమౌళిని పదే పదే రిక్వెస్ట్ చేయడం.
సుకుమార్, సందీప్ వంగ రెడ్డి లాంటి వాళ్లను అక్కడకు తీసుకెళ్లే ప్రయత్నాలు అన్నీ కళ్ల ముందు కనిపి స్తున్నవే. ఇలా బాలీవుడ్ చేయాల్సిన ప్రయత్నాలన్ని చేసింది. దీంతో లాభం లేదనుకున్న ఇండస్ట్రీ ఏకంగా ఖాన్ త్రయాన్నే రంగంలోకి దించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఒకే ప్రేమ్ లో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి పనిచేయలేదు.
సల్మాన్ ఖాన్-అమీర్ ఖాన్ కొన్నేళ్ల క్రితం `అందాజ్ అప్నా అప్నా` లో కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ వాళ్లిద్దరు కూడా కలిసి నటించలేదు. ఈనేపథ్యంలో ఆద్వయం అదే సినిమాకు సీక్వెల్ సన్నాహాలు చే స్తోంది. అలాగే షారుక్ ఖాన్...సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్ కలిసి నటించడానికి ప్రయత్నాలు మొదల య్యాయి. ఇప్పటికే అమీర్ ఖాన్ ముగ్గురు ఇమేజ్ కు తగ్గ కథ దొరికితే కలిసి నటించడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.
సరైన కథ దొరికితే ఇప్పటికిప్పుడు రెడీ అనేసారు. అలాగే కొన్ని ఓల్డ్ క్లాసిక్ హిట్స్ కు సీక్వెల్స్ తెరకెక్కు తున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వచ్చే ఏడాది నుంచి రిలీజ్ కానున్నాయి. వాటిలో కొన్ని చిత్రాలు పాన్ ఇండియాలో రిలీజ్ కానున్నాయి. ఈప్రణాళిక అంతా చూస్తుంటే? టాలీవుడ్ పై పోటీగా దించుతున్నట్లే కనిపిస్తుంది.