ట‌బు సింగిల్ గా ఉండ‌టానికి కార‌ణం వాళ్లేనా?

వెర్సటైల్ నటి టబు - అజయ్ దేవగన్ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-05-13 08:45 GMT

వెర్సటైల్ నటి టబు - అజయ్ దేవగన్ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే 50 ఏళ్లు దాటినా టబు ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటంపై బాలీవుడ్ స‌హా టాలీవుడ్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ ఇంట ర్వ్యూలో స్పందించిన టబు తాను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్ దేవగనే ప్రధాన కారణమని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టబు - అజయ్ దేవగన్ చిన్నప్పటి నుండే స్నేహితులు.

అజయ్, టబు కజిన్ అయిన సమీర్ ఆర్యకు పక్కింటి అబ్బాయి ప్రాణస్నేహితుడు. టబు ఎదుగుతున్న క్రమంలో అజయ్ .. సమీర్ ఇద్దరూ ఆమెపై నిరంతరం నిఘా ఉంచేవారట. ఎవరైనా అబ్బాయి టబుతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఇద్దరూ కలిసి వారిని బెదిరించడం ..కొట్టడానికి వెళ్లడం చేసేవారని టబు గుర్తు చేసుకున్నారు. ఆ భయం వల్లే తన దగ్గరకు ఎవరూ రాలేదని అందుకే తాను ఇంకా సింగిల్‌గా ఉండిపోయానని చమత్కరించారు. `అజయ్ - సమీర్ అప్పట్లో పెద్ద రౌడీల్లా ఉండేవారు. నేను ఎవరితోనైనా మాట్లాడుతుంటే చూసి ఊరుకునేవారు కాదు.

అజయ్ చేసిన పనికి ఆయన ఇప్పుడు తప్పకుండా పశ్చాత్తాపపడాలి` అని ట‌బు న‌వ్వే సారు. తాను పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్‌ను బాధ్యుడిని చేస్తూనే ఓ సందర్భంలో `నాకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని అజయ్‌నే అడిగాను` అని వెల్లడించారు. ఇద్ద‌రి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధం ఈ వ్యాఖ్యల తో మ‌రోసారి స్పష్టమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య సంబంధాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. కానీ టబు అజయ్ మాత్రం 25 ఏళ్లుగా ఒకే రకమైన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు.

`విజయ్‌పథ్` నుండి ప్రారంభమైన ఇద్ద‌రి ప్రయాణం `దృశ్యం`, `గోల్‌మాల్ అగైన్`, `భోలా` వంటి చిత్రాల వరకు విజయవంతంగా సాగుతోంది. తెరపై వీరి కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో? వ్యక్తిగత జీవితంలోనూ ఒకరిపై ఒకరికి అంతటి గౌరవం , రక్షణ భావం ఉందని టబు అనేక సందర్భాల్లో రివీల్ చేసారు. అజయ్ దేవగణ్ గురించి మ‌రిన్ని విష‌యాలు చెప్పారు. `నేను ఇండస్ట్రీలో ఎవరినైనా గుడ్డిగా నమ్మగలను అంటే అది అజయ్‌నే. ఆయన నా పట్ల ఎంతో కేరింగ్‌గా ఉంటారు. షూటింగ్ సెట్స్‌లో అజయ్ ఉంటే నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది` అని అన్నారు.

పెళ్లి గురించి ఎన్ని ప్రశ్నలు ఎదురైనా? తన స్నేహితులతో గడిపే సమయమే తనకు అత్యంత సంతోషాన్నిస్తుందని నమ్ముతారు. అజయ్ సరదాగా చేసిన ఆ బెదిరింపులు తన జీవితాన్ని ఇలా మలుపు తిప్పాయని ఆమె సరదాగా గుర్తు చేసుకుంటారు.

Tags:    

Similar News