అందమైన గులాబీలా మృణాల్ మెరుపులు
గులాబీల మధ్య నవ్వుతూ.. మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌లో వసంతాన్ని స్వాగతించేసింది.;
గులాబీల మధ్య నవ్వుతూ.. మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌లో వసంతాన్ని స్వాగతించేసింది. కోస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఆమె చేసిన ఈ ఫోటోషూట్ ఎంతో బ్యూటీఫుల్ గా ఉంది. పూలతో ముడిపడిన రంగుల దుస్తులు మరింత అందంగా హైలెట్ అయ్యాయి. పింక్, గ్రీన్, క్రీమ్ రంగుల్లో ఉండే డ్రెస్సులతో ఆమె వేసిన పోజులు మనసును తాకేలా ఉన్నాయి.
ఒక ఫొటోలో నవ్వుతూ కూర్చుంది.. ఈ ఫోటోలు ఆమెలోని ఫెమినిన్ గ్లామర్‌తో పాటు ఇంటెన్సిటీని కూడా చూపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’ చిత్రంతో చాలా దగ్గరైన మృణాల్.. ఆ తర్వాత 'హాయ్ నన్న' లాంటి సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. తక్కువ సమయంలోనే దక్షిణాది పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
నటనలో ఆమె చూపించిన హావభావాలను ఇప్పటికే అన్ని వర్గాల ఆడియెన్స్ మెచ్చుకుంటారు. అదే అనుభూతిని ఈ ఫోటోల్లో కూడా పలికిస్తోంది. ఇక ఈ ఫోటోషూట్‌కు ‘బ్లూమింగ్ ఇన్‌టు ఏ న్యూ సీజన్’ అనే క్యాప్షన్ పెట్టిన మృణాల్.. వసంతాన్ని, కొత్త ప్రారంభం అంటూ అందమైన వివరణ ఇచ్చింది. ఫొటోషూట్ కోసం ఆమె ఫ్లవర్ ఆర్ట్‌ని పటిష్టంగా ఉపయోగించిన విధానం, బ్యాక్‌డ్రాప్ డిజైన్ వరకు అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి.
మొత్తానికి మృణాల్ ఠాకూర్ తన ఫోటోషూట్‌తో మరోసారి ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. మంచి విజయాలు వచ్చిన తరువాత కూడా అమ్మడు తొందర పడకుండా నెమ్మదిగా కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సన్ ఆఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్ లాంటి సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో అడివి శేష్ డెకాయిట్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.