ఇదీ ఒరిజినల్ రూపం.. బెబో ధైర్యానికి ప్రశంసలు
బెబో కరీనా కపూర్‌ఖాన్ కొంత కాలంగా రకరకాల కారణాలతో మీడియా హెడ్ లైన్స్‌లోకొచ్చింది.;
బెబో కరీనా కపూర్‌ఖాన్ కొంత కాలంగా రకరకాల కారణాలతో మీడియా హెడ్ లైన్స్‌లోకొచ్చింది. భర్త సైఫ్ ఖాన్ పై దుండగుడి ఎటాక్ నేపథ్యంలో కరీనాపై యూట్యూబ్ చానెళ్లు చాలా రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల తుది విచారణ కొనసాగుతోంది. ఇంతలోనే కరీనా కపూర్ - సైఫ్ జంట తమ సెలబ్రేషన్స్ ని కొనసాగిస్తూనే ఉన్నారు. కరీనా తన స్వేచ్ఛా జీవనానికి సంబంధించిన ప్రతి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవడం లేదని సిగ్నల్స్ ఇస్తోంది.
తాజాగా ఈ సీనియర్ నటి సెల్ఫీ క్వీన్ గా మారి సెల్ఫీ కొల్లేజ్ ని షేర్ చేసింది. ఇందులో ఒక ప్రత్యేకమైన సెల్ఫీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది మేకప్ లేని ఒరిజినల్ రూపం. ఈ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అంతర్జాలంలో ట్రెండింగ్‌గా మారింది. దేవతాసుందరి కరీనా అంటూ చాలా మంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా తన రూపంలో ఒరిజినాలిటీని యథాతథంగా ప్రదర్శించినందుకు సెలబ్రిటీలు సైతం ప్రశంసిస్తున్నారు. కరీనా ఈ పోస్ట్‌కు ``నేను అనుకున్నదానికంటే ఎక్కువ సెల్ఫీలు... క్షమించండి కాదు క్షమించండి`` అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ సోషల్ మీడియాల్లో ట్రెండింగ్ గా మారింది.
కరీనా బ్లాక్ బికినీలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖంపై చిన్న పాటి మచ్చలతో ఉన్న తన ఒరిజినల్ రూపాన్ని ప్రదర్శించే సాహసంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బెబో ఇద్దరు పిల్లలకు మామ్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా అభిమానులు గుర్తుంచుకోవాలి. వయసు రీత్యా కూడా తన రూపంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అయినా ఇప్పటికీ బెబో నటనలో క్వీన్ గా వెలుగుతోంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే .. క్రూ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దాయ్రాలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఎంపూరన్ దర్శకనటుడు పృథ్వీరాజ్ సుకుమార్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.