• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బింబిసార 2.. ఎంతవరకు...

బింబిసార 2.. ఎంతవరకు వచ్చిందంటే..

| అందుకే బింబిసార పార్ట్ 2 కోసం అనిల్ పాడూరిని దర్శకుడిగా ఎంచుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కథని రెడీ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు వశిష్ట కూడా బింబిసార 2 కథని రెడీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-12-28 16:30 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో 'బింబిసార' ముందు వరుసలో ఉంటుంది. సుమారు ఆరేళ్లుగా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా భారీ కం బ్యాక్ ఇచ్చి కళ్యాణ్ రామ్ కెరియర్ ని నిలబెట్టింది. కమర్షియల్ గాను ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. వశిష్ట అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన నటనతో అదరగొట్టాడు.

కాగా ఈ సినిమా సమయంలోనే 'బింబిసార' పార్ట్ 2 ఉంటుందని కళ్యాణ్ రామ్ ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిగా వశిష్ట తప్పుకున్నారు. ప్రస్తుతం అతను మెగాస్టార్ చిరంజీవితో సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కూడా రామ్ చరణ్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకుంటున్నాడు. దీన్నిబట్టి వశిష్ట కళ్యాణ్ రామ్ కు అందుబాటులో లేడనే విషయం స్పష్టం అవుతుంది.

అందుకే బింబిసార పార్ట్ 2 కోసం అనిల్ పాడూరిని దర్శకుడిగా ఎంచుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కథని రెడీ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు వశిష్ట కూడా బింబిసార 2 కథని రెడీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. బింబిసార చేస్తున్నప్పుడే వశిష్ట దగ్గర పార్ట్2 ఆలోచన ఉందట. దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో డెవలప్ చేసినట్లు సమాచారం.

అటు కళ్యాణ్ రామ్ కూడా తన టీం తో బింబిసార 2 కథను రెడీ చేయిస్తున్నాడు. రెండు నెలల్లో స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. నిజానికి వశిష్ట కూడా 'బింబిసారా 2' కథని కళ్యాణ్ రామ్ కోసమే రెడీ చేశాడు. కానీ ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు అర్థమవుతుంది. కళ్యాణ్ రామ్ పిలిచి బింబిసార 2 కథ రెడీ చేయమని చెబితే ఇప్పటికీ వశిష్ట సిద్ధంగానే ఉన్నాడు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం తన సొంత టీం తో కథ తయారు చేసుకుంటున్నాడు.

కళ్యాణ్ రామ్ టీమ్ కథ తీసుకుంటే వశిష్ట తన కథలో చిన్న చిన్న మార్పులు చేసి మరో హీరోతో సినిమాని తెరకెక్కించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా ఒకేసారి ఒకే సినిమాకి రెండు చోట్ల కథలు సిద్ధమవుతుండడం బహుశా అది 'బింబిసార' విషయంలోనే జరిగి ఉంటుంది. ఇక కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన 'డెవిల్' ఈనెల 29న విడుదల కాబోతోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు.

Tags:    
  • Tollywood 
  • Movie 
  • Bimbisara 
  • Kalyanram 
  • Vasishta 
  • Bimbisara2 
  • Update 
  • Scriptwork 
  • Director 
  • Anil 
  • Filmindustry 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS