• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ఓజీ లో బిగ్ బాస్ శుభ...

పవన్ ఓజీ లో బిగ్ బాస్ శుభ శ్రీ..?

| ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. పవన్ కళ్యాణ్ ఓజీ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో శుభ శ్రీ నటిస్తుందట

By - Tupaki Desk
Update: 2023-09-07 05:56 GMT

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా మొదలైంది. ఈ సీజన్ లో అందాల భామలు చాలామంది ఉన్నారు. సీరియల్ యాక్టర్స్ చాలామంది ఉండగా యువ హీరోయిన్ శుభ శ్రీ కూడా హౌస్ లోకి వచ్చింది. తెలుగులో ఆల్రెడీ రెండు మూడు సినిమాల్లో నటించిన ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. చివరగా కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాలో కూడా శుభ శ్రీ నటించింది. సోలో సినిమాలతో పాటుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్న శుభ శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ కూడా అందుకుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమాలో శుభ శ్రీ నటించిందట.

ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. పవన్ కళ్యాణ్ ఓజీ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో శుభ శ్రీ నటిస్తుందట. పవన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుంటుందని.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నది శుభ శ్రీ. స్వతహాగా లాయర్ అయిన శుభ శ్రీ సినీ పరిశ్రమ మీద ఆసక్తితో ఇటు వైపు వచ్చింది. మొదట హీరోయిన్ గా ప్రయత్నించినా సరే అలా అయితే కష్టమని సైడ్ రోల్స్ కూడా చేస్తూ వస్తుంది.

బిగ్ బాస్ హౌజ్ లో శుభ శ్రీ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఈ సీజన్ లో శుభ శ్రీ తో పాటుగా ప్రియాంకా జైన్, శోభా శెట్టి, రతిక ఇలా చాలామంది అందాల భామలు తోటి కంటెస్టెంట్స్ తో పాటుగా ఆడియన్స్ ని కూడా తమ బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు. జరిగిన 3 రోజుల ఆటలో పెద్దగా టాస్క్ లు ఏమి ఇవ్వకపోయినా ఇప్పటికే హౌజ్ లో వారికి తగిన ఫ్రెండ్స్ ని ఏర్పరచుకున్నారు. అంతేకాదు ఇప్పటికే గ్యాంగ్ లు కూడా రెడీ అయినట్టే అనిపిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 7 ని బిగ్ బాస్ టీం అయితే కొత్తగా ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. అయితే డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ ఇవ్వడం వల్ల లైవ్ చూసిన ఆడియన్స్ ఎపిసోడ్ కేవలం వన్ అవర్ మాత్రమే ఉండటం లైవ్ లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలను స్కిప్ చేయడం గురించి అసంతృప్తిగా ఉన్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 7 ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో టీం అంతా కష్టపడుతుందని చెప్పొచ్చు. కింగ్ నాగార్జున హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 14 మంది కంటెస్టంట్స్ తో మొదలైంది. మొదటి వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు.

Tags:    
  • Biggboss7 
  • Subhasree 
  • Bb7contestant 
  • Realitygameshow 
  • Pawankalyan 
  • OGmovie 
  • Tollywood 
  • Sujeeth 
  • Filmindustry 
  • Biggbosstelugu 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS