• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : మెగా చీఫ్...

బిగ్ బాస్ 8 : మెగా చీఫ్ గా గెలిచింది ఎవరంటే..?

| నిన్నటిదాకా చీఫ్ కంటెండర్ టాస్క్ నడిపించిన బిగ్ బాస్ అందులో ఓజీ క్లాన్ విజయం సాధించగా ఆ క్లాన్ మొత్తాన్ని చీఫ్ కంటెండర్ గా ఛాన్స్ ఇచ్చాడు.

By - Tupaki Desk
Update: 2024-10-18 16:57 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం మెగా చీఫ్ గా నిలిచేందుకు హౌస్ లో రకరకాల టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. నిన్నటిదాకా చీఫ్ కంటెండర్ టాస్క్ నడిపించిన బిగ్ బాస్ అందులో ఓజీ క్లాన్ విజయం సాధించగా ఆ క్లాన్ మొత్తాన్ని చీఫ్ కంటెండర్ గా ఛాన్స్ ఇచ్చాడు. మరోపక్క కుషన్ టాస్క్ లో గెలిచిన వారిని కూడా చీఫ్ కంటెండర్స్ గా ఉంచాడు. ఆల్రెడీ గంగవ్వ దగ్గర చీఫ్ కంటెండర్ షీల్డ్ ఉండటంతో ఆమె కొనసాగుతుంది.

ఐతే బిగ్ బాస్ చివరగా పట్టుకుంటారా విడిచి పెడతారా టాస్క్ లో సర్కిల్ లో ఉన్న వస్తువుని పట్టుకుని మరో ఇద్దరిని ఆటలోంచి తీసేయాలి. అలా చివరి దాకా ఎవరు ఉంటారో వారే ఈ వారం మెగా చీఫ్ గా నిలుస్తారు. ఐతే ఈ టాస్క్ లో గౌతం కృష్ణ మొదటి నుంచి డామినేట్ గా కనిపించాడు. ఫైనల్ గా అతనే చివరి దాకా ఉన్నాడు. గౌతం, గంగవ్వ మధ్య చివరి రౌండ్ జరగగా గౌతం గెలిచి ఈ వారం మెగా చీఫ్ గా నిలిచాడు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గౌతం వచ్చీరాగానే అవినాష్ తో అశ్వథ్థామ 2.O గురించి గొడవ తెలిసిందే. అంతేకాదు ఈ వారం అతను నామినేషన్స్ లో కూడా ఉన్నాడు. నామినేషన్స్ లో ఉన్న 9 మందిలో హరితేజ, తేజ, గౌతం ఈ ముగ్గురు ముందు వెనక అన్నట్టు ఉన్నారు. లీస్ట్ 3 లో ఉన్న వీరిలో ఎవరు ఫైనల్ గా ఎలిమినేట్ అవుతారన్నది ఆదివారం తెలుస్తుంది.

ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో గౌతం మెగా చీఫ్ అవ్వడం అతనికి చాలా మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. అంతేకాదు అతని ఆట ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐతే గౌతం ఈ వారం సేఫ్ అయితేనే నెక్స్ట్ వీక్ మెగా చీఫ్ గా కొనసాగుతాడు. ఎలాగు మెగా చీఫ్ అంటే నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ లేదు. సో అలా రెండు వారాలు హౌస్ లో ఉండొచ్చు. మరి బిగ్ బాస్ ఆడియన్స్ గౌతం ని మెగా చీఫ్ గా కొనసాగిస్తారా లేదా ఆదివారం బయటకు పంపుతారా అన్నది చూడాలి.

Tags:    
  • Biggboss8 
  • Megachief 
  • Gautham 
  • Avinash 
  • Chiefcontestant 
  • Telugubiggboss 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS