బిగ్ బాస్ 9.. ఆమె వల్ల అతను కెప్టెన్ అయ్యాడు..!
బిగ్ బాస్ సీజన్ 9లో రెండో కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. లాస్ట్ వీక్ సెలబ్రిటీస్ అంటే టెనంట్స్ తరపు నుంచి కెప్టెన్ గా సంజన ఎంపికయ్యారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో రెండో కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. లాస్ట్ వీక్ సెలబ్రిటీస్ అంటే టెనంట్స్ తరపు నుంచి కెప్టెన్ గా సంజన ఎంపికయ్యారు. ఆమెను హౌస్ లో రానివ్వకుండా చేయాలని అనుకున్న ఓనర్స్ ఆటలకు చెక్ పెట్టాడు బిగ్ బాస్. ఇక రెండో వారం కూడా గురువారం ఎపిసోడ్ నుంచి కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇచ్చిన టైమర్ గేమ్ లో మొదటి టాస్క్ గా కాల చక్రం అంటూ ఒక చక్రం ఇచ్చి దాన్ని ఓనర్స్, టెనంట్స్ నుంచి ఐదుగురు ఐదుగురు పట్టుకున్నారు. అందులో చివరి వరకు ఏ టీం సభ్యులు అధికంగా ఉంటారో వాళ్లే విన్ అయినట్టు అవుతుంది.
డీమాన్ పవన్ కెప్టెన్ గా..
ఆ టాస్క్ లో ఓనర్స్ విన్ అయ్యారు. ఐతే ఫైనల్ గా రంగు అద్దే టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ లో భరణి, డీమన్ పవన్, ఇమ్మాన్యుయెల్, మనీష్ పాల్గొన్నారు. అందులో డీమాన్ పవన్ గెలిచి కెప్టెన్ గా విన్ అయ్యాడు. ఐతే ఈ టాస్క్ కి సంచాలక్ గా రీతు చౌదరి వ్యవహరించింది.
ఆమె వల్లే డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. ఎందుకంటే భరణి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ ఉన్నప్పుడు రీతు చౌదరి గేమ్ ని పాజ్ చేసి భరణి ని అవుట్ అని అన్నది. కేవలం అతన్ని ఆట నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో ఆమె అలా చెప్పింది.
ఎలాగు బిగ్ బాస్ టాస్క్ లో సంచాలక్ నిర్ణయం ఫైనల్ కాబట్టి డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. ఐతే ఈ ఎఫెక్ట్ కచ్చితంగా రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఆమెకు పడే ఓట్స్ మీద ఉంటుంది. ఆటగాళ్లు అందరికీ సమానంగా ఫెయిర్ డెసిషన్ తీసుకోవాలి అలా కాకుండా ఫేవరిటిజం చూపిస్తే మాత్రం సంచాలక్ గా ఎవరు వస్తే వాళ్లకు నచ్చిన వాళ్లకే గెలుపు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ వీక్ నామినేషన్స్ లో..
మరి వీకెండ్ నాగార్జున ఈ కెప్టెన్సీ టాస్క్ విషయంలో రీతూ చౌదరికి ఎలాంటి క్లాస్ పీకుతారన్నది చూడాలి. ఐతే కొత్త కెప్టెన్ గా డీమాన్ పవన్ చార్జ్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నాడు డీమాన్ పవన్. అతను సేఫ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ అతనికి ఇమ్యునిటీ వస్తుంది.
లాస్ట్ వీక్ శ్రష్టితో చివరి దాకా నామినేషన్స్ లో ఉండి సేఫ్ అయిన డీమాన్ పవన్ ఈ వారం కెప్టెన్ గా మారాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి ఎప్పుడు ఏ పవన్ వస్తుందో తెలియదు కాబట్టి హౌస్ లో అందరు అలర్ట్ గానే ఉండాలి.