బిగ్ బాస్ 9.. ఐదో వారం నామినేషన్స్ ఉన్నది ఎవరంటే..?
సంజన, డీమాన్, రీతు, తనూజ, దివ్య, శ్రీజ, భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, కళ్యాణ్ ఇలా అందరు కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ రాము కాకుండా అందరినీ నామినేషన్స్ లో అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఆ నెక్స్ట్ ఫ్లోరా షైనీ కూడా డైరెక్ట్ 2 వీక్స్ నామినేషన్స్ కాబట్టి ఆమెను ఇమ్యూనిటీ టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక రాము, ఫ్లోరా కాకుండా మిగిలిన వారందరికీ ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు. పెద్ద బెడ్ ఏర్పాటు చేసి అందులో నుంచి ఎవరిని కిందకు పంపితే వాళ్లు నామినేట్ అయినట్టు చెప్పారు. అలా రౌండ్ల వారిగా జరిగిన ప్రక్రియలో ఫైనల్ గా ఒక్క కంటెస్టెంట్ తప్ప మిగతా అందరు కూడా నామినేషన్స్ లోకి వచ్చారు.
ఈ వారం 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో..
సంజన, డీమాన్, రీతు, తనూజ, దివ్య, శ్రీజ, భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, కళ్యాణ్ ఇలా అందరు కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ టైం లో రీతు చౌదరి భరణి మీద తన అసంతృప్తి వ్యక్తపరిచింది. దివ్య మీద శ్రీజ కూడా గొడవ పడింది. శ్రీజ కూడా రేలంగి మామయ్య అంటూ శ్రీజ ఫైర్ అయ్యింది. ఫైనల్ గా ఈ వారం 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అందరినీ నామినేషన్స్ లో పెట్టి ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చి అందరు అందరినీ టార్గెట్ చేసేలా చేశారు.
ఇక కెప్టెన్ గా రాము కూడా ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ కాగా ఇమ్మాన్యుయెల్ కూడా సేఫ్ చేయబడ్డాడు. ఇక నెక్స్ట్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాదు నెక్స్ట్ వీకెండ్ బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వెర్షన్ 2.ఓ లాంచింగ్ ఉంటుందట.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరో ఐదుగురు హౌస్ లోకి..
సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరో ఐదుగురు హౌస్ లోకి రాబోతున్నారు. సీజన్ 9 ఆటని మరింత రసవత్తరంగా మార్చేందుకు హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. తప్పకుండా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత సీజన్ 9 ఎంటర్టైన్మెంట్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్తుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ లో ఒక వీక్ కంటెస్టెంట్ తో పాటు మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని తెలుస్తుంది.
ఇప్పటికే సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఎవరెవరు వస్తున్నారన్న లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే లిస్ట్ అయితే మాత్రం హౌస్ మెట్స్ కి కచ్చితంగా గట్టి పోటీ ఉంటుందని చెప్పొచ్చు.