బిగ్ బాస్ 9.. సేఫ్ అవ్వడమే కాదు ఆ కంటెస్టెంట్ కెప్టెన్ కూడా..!
కేవలం సంజన ఒక్కతే తనూజకి సపోర్ట్ చేసింది. ఫైనల్ గా డేంజర్ జోన్ నుంచి సేఫ్ అవ్వడమే కాదు ఏకంగా కెప్టెన్ అయ్యాడు కళ్యాణ్.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం డేంజర్ జోన్ లో అందరు కంటెస్టెంట్స్ ని పెట్టి హౌస్ మెట్స్ అందరికీ రకరకాల టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో వారు జంటగా ఏర్పడి ఈ ఆటని ఆడారు. ఈ టాస్కుల్లో లీడర్ బోర్డ్ లో భరణి, దివ్య టాప్ ప్లేస్ లో నిలిచారు. నెక్స్ట్ తనూజ, కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఐతే లీడర్ బోర్డ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న భరణి, దివ్య కలిసి లీస్ట్ 2 ఉన్న సంజన, ఫ్లోరా ఇంకా శ్రీజ, సుమన్ శెట్టిలో ఒక జోడీని టాస్క్ నుంచి తొలగించాలి. అంటే వాళ్లు ఇక డేంజర్ జోన్ లోనే కొనసాగుతారు. భరణి, దివ్య కలిసి సంజన, ఫ్లోరా షైనీలను ఆట నుంచి తొలగించారు.
ఫిజికల్ టాస్క్ లు పెట్టేటట్టు అయితే ఇంటికి పంపించండి..
ఐతే వాళ్లు తీసుకున్న ఈ నిర్ణయం పై సంజన అప్సెట్ అయ్యింది. అంతేకాదు ఆమె చాలా ఎమోషనల్ అయ్యి ఒక్కతే తన బెడ్ మీద కూర్చుని ఏడ్చేసింది. ఇలా ఫిజికల్ టాస్క్ లు పెట్టేటట్టు అయితే తనని ఇంటికి పంపించమని బిగ్ బాస్ తో చెప్పింది సంజన. ఇక ఇదిలా ఉంటే లీడర్ బోర్డ్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న భరణి, దివ్యలకు బిగ్ బాస్ హౌస్ లో బెడ్స్ యాక్సెస్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ కళ్యాణ్, తనూజాలో ఒకరికి అలా డేంజర్ జోన్ లో నుంచి సేఫ్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. ఐతే తనూజ, కళ్యాణ్ మాట్లాడుకుని కళ్యాణ్ ని సేఫ్ అయ్యే నిర్ణయం తీసుకుంది.
ఇక మిగిలిన డేంజర్ జోన్ లో సభ్యులకు వాటర్ టబ్ టాస్క్ ఒకటి పెట్టారు. అందులో వాటర్ లెవెల్ దాటి రాకుండా.. మధ్యలో వాళ్లు ఆ టబ్ నుంచి లేవకుండా చూసుకోవాలి. అలా తనూజ చివరి వరకు ఉంది. ఆమె ఈ టాస్క్ విన్ అయ్యి సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ఐతే ఇలా డేంజర్ జోన్ లో నుంచి బయటకు వచ్చిన వారికి కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సంజన సంచాలక్ గా జరిగిన ఈ బల్బ్ టాస్క్ లో తనూజ, కళ్యాణ్ చివరి వరకు ఉన్నారు.
డేంజర్ జోన్ లో ఉన్న వారు నిర్ణయించాల్సి..
ఐతే వారిలో ఎవరు కెప్టెన్ అవ్వాలన్నది డేంజర్ జోన్ లో ఉన్న వారు నిర్ణయించాల్సి ఉండగా శ్రీజ మిగతా టీం మెంబర్స్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు. కేవలం సంజన ఒక్కతే తనూజకి సపోర్ట్ చేసింది. ఫైనల్ గా డేంజర్ జోన్ నుంచి సేఫ్ అవ్వడమే కాదు ఏకంగా కెప్టెన్ అయ్యాడు కళ్యాణ్. తనూజతో ఈ వీక్ జరిగిన టాస్కుల్లో మొదట్లో వెనకపడినా కూడా లాస్ట్ 3 టాస్కుల్లో మంచి ప్రదర్శన ఇచ్చి డేంజర్ జోన్ లో నుంచి సేఫ్ అవ్వడమే కాదు కెప్టెన్ గా కూడా గెలిచాడు కళ్యాణ్.