బిగ్ బాస్ 9.. ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే..?

ఈ జరిగిన 3 వారాల్లో ముగ్గురు హౌస్ మెట్స్ ఎలిమినేట్ అవ్వగా నాలుగో వారం ఎలిమినేషన్ ట్విస్ట్ ఉండబోతుందని అనుకున్నారు.;

Update: 2025-10-05 03:56 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో నాలుగో వారం ఎలిమినేషన్ ఈరోజు జరుగుతుంది. ఈ జరిగిన 3 వారాల్లో ముగ్గురు హౌస్ మెట్స్ ఎలిమినేట్ అవ్వగా నాలుగో వారం ఎలిమినేషన్ ట్విస్ట్ ఉండబోతుందని అనుకున్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి అవుతుందని హడావిడి చేశారు కానీ అలాంటిది ఏమి జరగలేదు. ఫైనల్ గా ఈ వారం నామినేట్ అయిన ఆరుగురు హౌస్ మెట్స్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఫ్లోరా షైనీ, హరీష్, రీతు, శ్రీజ, సంజన, దివ్య నామినేషన్స్ లో ఉన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో సండే ఎపిసోడ్..

వీరిలో నుంచి ఆడియన్స్ ఓటింగ్స్ లీస్ట్ లో ఎవరు ఉంటారో వాళ్లు హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఐతే ఆదివారానికి సంబందించిన ఎపిసోడ్ శనివారం పూర్తవుతుంది. సో దాని వల్ల బిగ్ బాస్ హౌస్ లో సండే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ముందే లీక్ అవుతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 9లో నాలుగో వారం హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.

సీజన్ 9లో హరీష్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చాడు. మాస్క్ మ్యాన్ గా అగ్నిపరీక్ష జడ్జిలకు షాక్ ఇచ్చిన హరీష్ అభిజిత్, బిందు మాధవి రెడ్ సిగ్నల్ ఇచ్చినా నవదీప్ వల్ల అతను టాప్ 15లో ఛాన్స్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ అతని మాట తీరు చూసి బింధు మాధవి అతన్ని హౌస్ లోకి పంపించింది. కానీ హరీష్ ఈ నాలుగు వారాల్లో చేసింది ఏమి లేదు. ప్రతి విషయాన్ని గొడవకు దారి తీసేలా ప్రవర్తించడం.. తానే కరెక్ట్ అవతల వాళ్లది తప్పు అనేలా వ్యవహరించడం మైనస్ అయ్యాయి.

బీన్ బ్యాగ్ కే అంకితం..

జరిగిన వీక్ అంతా కూడా హెల్త్ సపోర్ట్ చేయక బీన్ బ్యాగ్ కే అంకితం అయ్యాడు హరీష్. ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అతన్ని ఇంటికి పంపించేశారు. హరీష్ తన ఫ్యామిలీ గురించి ముఖ్యంగా బయట ఉన్న హరిత గురించి ఎప్పుడు తపన పడుతూ కనిపించాడు. ఆమె ఒక్కతె ఉంటుంది అంటూ చెబుతాడు. బిగ్ బాస్ కి వచ్చి ఏదో సాధిస్తాడని అనుకున్న హరీష్ పూర్తిగా డిజప్పాయింట్ చేశాడు.

బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ ని అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. ఐతే అందులో ఇప్పటికే మనీష్, ప్రియా ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా హరీష్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నాడు. సో ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి వెళ్లగా ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.

Tags:    

Similar News