చరణ్ ని చుట్టుకున్న 'మిడ్ వీక్ ఎలిమిలేషన్'?

హై రిస్క్ జోన్‌లో ఉన్నవారు ఏ క్షణమైనా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చని ఆల్రెడీ వారం మొదట్లోనే బిగ్ బాస్ బాంబు పేల్చిన సంగతి మనకి తెల్సిందే.

Update: 2026-09-10 01:44 GMT

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మొదటి వారమే ఊహించని ట్విస్ట్ ఎదురు కాబోతోంది. ఇప్పటికే 16 మంది ఉన్న హౌస్ లో ఒక సంచలన మిడ్-వీక్ ఎలిమినేషన్ జరగనుందని, అందులో ఆర్‌జే చరణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇంటర్నెట్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే, అది బిగ్ బాస్ చరిత్రలో మొదటి సారి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి దాకా ఏ సీజన్ లోనూ మొదటి వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగక పోవడం గమనార్హం.

హై రిస్క్ జోన్‌లో ఉన్నవారు ఏ క్షణమైనా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వొచ్చని ఆల్రెడీ వారం మొదట్లోనే బిగ్ బాస్ బాంబు పేల్చిన సంగతి మనకి తెల్సిందే.

రెడ్, బ్లూ టీమ్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో పడ్డారు. బ్లూ టీమ్ నుంచి ఆటో రామ్ ప్రసాద్, మరో టీమ్ నుంచి ఆర్‌జే చరణ్ నేరుగా 'హై రిస్క్ జోన్'లోకి వెళ్లారు.

తక్కువ ఓట్లు వచ్చిన వారిని పంపిస్తారా? లేక ఈ ఇద్దరిలో ఒకరిని నేరుగా ఎలిమినేట్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అగ్నిపరీక్ష లో పాల్గొన్న భాగీ అనే కంటెస్టెంట్ వీడియో పెడుతూ చరణ్ ఎలిమినేటి అయినట్టున్నాడు అనే సమాచారాన్ని ఇచ్చింది. నిజానికి రామ్ ప్రసాద్కు బయట మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు హౌస్‌లో అందరితో కలిసిపోతూ, తన మార్క్ కామెడీతో, టాస్కుల్లో చురుకుగా ఉంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి రామ్ ప్రసాద్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ దాదాపు లేదు.

కానీ చరణ్‌ మాత్రం ఈ రోజు దాకా గేమ్‌లో పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడం, యాక్టివ్‌గా కనిపించకపోవడం అతనికి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. పైగా హౌజ్ లో ఇప్పటికిప్పుడు ఇద్దరి మధ్య ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని హౌజ్ మేట్స్ ని బిగ్బాస్ అడిగితే, మెజారిటీ ఆటో రాంప్రసాద్ వైపే మొగ్గు చూపుతుంది. నిజానికి హౌజ్ లో కూడా అదే జరగనుంది అని సమాచారం.

అనూహ్య మార్పులు జరిగితే తప్ప, తొలి వారం మిడ్-వీక్ ఎవిక్షన్లో హౌస్ వీడేది చరణ్ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈ విషయం ధృవీకృతం అవ్వాలంటే, ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News