మొదటి వారమే ముగ్గురు ఔట్.. చరణ్, చైత్ర తర్వాత ఆయనే!
సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ వీకెండ్ ఎలిమినేషన్‌లో యాక్టర్ కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం 99 శాతం ఖాయమని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభమైన మొదటి వారం నుంచే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊహించని రీతిలో బిగ్ బాస్ వరుసగా మిడ్ వీక్ ఎలిమినేషన్లు పెట్టి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పటికే హౌస్ నుంచి కామనర్ ఆర్జే చరణ్, బుల్లితెర నటి చైత్ర రాయ్ ఎలిమినేట్ అయి బయటకు రాగా.. ఇప్పుడు వీకెండ్ ఎలిమినేషన్‌లో మరొకరు అవుట్ కానున్నారు. ఈ మేరకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ బయట పెట్టిన సమాచారం ప్రకారం ఈ వారం బయటకు వెళ్లే ఆ కంటెస్టెంట్ ఎవరో క్లారిటీ వచ్చేసింది.
రెండ్రోజుల్లో ఇద్దరు అవుట్ – హౌస్‌లో దడ!:
సాధారణంగా మొదటి వారం ఎలిమినేషన్ ఉంటుందో లేదో అని కంటెస్టెంట్లు కాస్త రిలాక్స్ అవుతుంటారు. కానీ ఈసారి బిగ్ బాస్ మాత్రం అస్సలు కనికరం చూపలేదు. మొదటి వారంలోనే డబుల్ షాక్ ఇస్తూ మిడ్ వీక్ ఎలిమినేషన్ల ద్వారా ఆర్జే చరణ్, చైత్ర రాయ్‌లను ఎలిమినేట్ చేశారు. ఇక దీంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులతో పాటు బయట చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక మైండ్ బ్లాంక్ అయింది.
హై రిస్క్ టాస్క్ – త్రిగుణ్ మైండ్ గేమ్‌లు!:
ఈ వారం హౌస్‌లో రెడ్ టీమ్, బ్లూ టీమ్‌ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. బిగ్ బాస్ ఇచ్చిన ‘హై రిస్క్ టాస్క్’లో రామ్ ప్రసాద్ హౌస్‌మేట్స్ మద్దతుతో చాకచక్యంగా సేవ్ అయ్యాడు. ఇక మరోవైపు త్రిగుణ్ తన మైండ్ గేమ్స్ ప్లే చేస్తూ అమన్ మసూద్‌తో మాట్లాడి రోహిత్‌పై నెగెటివిటీ పెంచే ప్రయత్నం చేశాడు. దీంతో ఎలిమినేషన్ ముప్పు అమన్, సుధీర్, వర్షిణి, కృష్ణుడులపైకి పడింది.
డేంజర్ జోన్‌లో నలుగురు – ఓటింగ్ లీక్స్:
ప్రస్తుత అనధికారిక ఓటింగ్ పోల్స్ ప్రకారం శ్రీష్టి, కృష్ణుడు, సుధీర్, వర్షిణిలు చాలా తక్కువ ఓటింగ్ శాతంతో చివరి స్థానాల్లో నిలిచారు. శ్రీష్టికి 1.90 శాతం ఓట్లు రాగా, మిగతా ముగ్గురికీ కేవలం 1.74 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉండటంతో చివరి నిమిషం వరకు ఎలిమినేషన్ ఉత్కంఠగా మారింది.
వినాయకుడి నిమజ్జనం – కృష్ణుడు అవుట్? :
సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ వీకెండ్ ఎలిమినేషన్‌లో యాక్టర్ కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం 99 శాతం ఖాయమని తెలుస్తోంది. ఇక నిమజ్జనానికి ఇంకా సమయం ఉంది కానీ, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఈ వినాయకుడిని (కృష్ణుడిని) వినాయక చవితికి ముందే నిమజ్జనం చేసేస్తున్నారంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ వారం ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్లు ఇంటిని వీడడం బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయంగా మారబోతోంది. మరి ఈ రోజు నాగార్జున వేదికపైకి వచ్చి ఎలాంటి ట్విస్టులు ఇస్తారు? కృష్ణుడి ఎలిమినేషన్‌ను అధికారికంగా ఎలా ప్రకటిస్తారనేది చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 10 రాబోయే రోజుల్లో మరిన్ని ఊహించని ట్విస్టులతో మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.