బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్.. ఎంటర్టైన్మెంట్ సంగతేంటి?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంజన తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక 8 మంది సెలబ్రిటీల లిస్టును విడుదల చేసింది.

Update: 2026-06-08 05:16 GMT

ఎక్కడో పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ పేరిట ప్రారంభమైన రియాలిటీ షోను హిందీలో బిగ్ బాస్ పేరిట ప్రారంభించారు. సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యుల వరకు ముక్కు మొహం తెలియని ఒక 15 నుండి 18 మందిని ఒకే హౌస్ లో దాదాపు 3 నెలల పాటు ఉంచి వారితో ఆటలు, పాటలు క్లిష్టమైన టాస్కులు నిర్వహించి ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందీలో బిగ్ బాస్ పేరిట ప్రారంభమైన ఈ రియాల్టీ షో క్రమంగా అన్ని భాషలను పాకిపోయింది. ఇప్పుడు ఒక్కో భాషలో సుమారుగా తొమ్మిదికి పైగా సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. హిందీలో ఇటీవల 19వ సీజన్ కూడా ముగిసింది. మరి తెలుగు విషయానికి వస్తే.. అట్టహాసంగా సీజన్ 9 పూర్తి కాగా ఇప్పుడు సీజన్ 10కి సర్వం సిద్ధం చేసుకుంటోంది ఈ బిగ్ బాస్.

అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 10 కాదు బిగ్ బాస్ దశావతారం అంటూ ఈ కొత్త సీజన్లో ఎంటర్టైన్మెంట్ అంతకుమించి ఉండేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం అనగా జూన్ 7వ తేదీన బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన ఒక వీడియోని నాగార్జున రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో బిగ్ బాస్ షో పై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సంజన గల్రానీ కూడా కంటెస్టెంట్స్ లిస్టు లీక్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంజన తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక 8 మంది సెలబ్రిటీల లిస్టును విడుదల చేసింది. అందులో ఎవరెవరు సీజన్లోకి అడుగుపెట్టబోతున్నారు అనే విషయానికొస్తే.. తన మాటలతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్న తమిళ్ బ్యూటీ దీపిక రంగరాజు ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 లోకే కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నారు

అలాగే ప్రముఖ సీనియర్ సీరియల్ యాక్ట్రెస్ హరిత, పల్లవి గౌడ, పల్లవి రామిశెట్టి వంటి సీరియల్ నటీమణులు హౌస్ లోకి అడుగుపెడుతుండగా.. మరొకవైపు యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహ తో పాటు సీరియల్ నటుడు పవన్ కళ్యాణ్ అలాగే ప్రముఖ యూట్యూబర్ ఉప్పల్ బాలు ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సంజన తెలిపారు.

సంజన షేర్ చేసిన బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ లిస్టు వైరల్ గా మారడంతో ఈసారి ఎంటర్టైన్మెంట్ ఫుల్ పక్కా.. గ్లామర్డోస్ అదుర్స్ అంటూ అభిమానులు అప్పుడే కామెంట్లు చేస్తున్నారు. మరి బిగ్ బాస్ లవర్స్ ని అలరించడానికి టోటల్గా ఎంతమంది హౌస్ లోకి అడుగు పెడతారు? వీరిలో ఎంత మంది ఫైనల్ గా హౌస్ లోకి అడుగు పెడతారు అన్నది చూడాలి.

Tags:    

Similar News