బిగ్ బాస్ 9.. ఊహించని ఎలిమినేషన్ షాక్..!
ఇక ఈ వారం హౌస్ నుంచి నామినేషన్స్ లో సుమన్, హరీష్, ప్రియ, రాము, కళ్యాణ్, రీతు చౌదరి ఉన్నారు. వారిలో ఒకరు ఈరోజు హౌజ్ కి గుడ్ బై చెప్పేస్తారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ షూటింగ్ పూర్తైంది. ఆల్రెడీ రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అందులో మొదటి వారం శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఆట మాత్రమే కాదు కొన్నిసార్లు కొన్ని విషయాల వల్ల ఎలిమినేట్ అవుతుంటారు.
మనీష్ ఇప్పుడే కాస్త బిగ్ బాస్ హౌస్ గేం ప్లాన్ ని అర్ధం చేసుకుని రంగంలోకి దిగుతున్నాడు అనుకునేలోగా ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్స్ నుంచి ఫ్లోరా షైనీ సేఫ్ అయ్యారు. ఆమె కూడా రెండు వారాలు చివరి దాకా వెళ్లి సేఫ్ అయ్యారు. ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్నా ఇమ్యునిటీ టాస్క్ గెలిచి నామినేషన్స్ నుంచి తప్పుకున్నారు.
హౌస్ లోకి దివ్య నిఖిత..
ఇక ఈ వారం హౌస్ నుంచి నామినేషన్స్ లో సుమన్, హరీష్, ప్రియ, రాము, కళ్యాణ్, రీతు చౌదరి ఉన్నారు. వారిలో ఒకరు ఈరోజు హౌజ్ కి గుడ్ బై చెప్పేస్తారు. ఆల్రెడీ ఈ వారం బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి దివ్య నిఖిత హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సంజనని బయటకు పంపించి మళ్లీ హౌస్ మెట్స్ సాక్రిఫైజ్ ల ద్వారా ఆమెను హౌస్ లోకి పంపించారు.
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో చాలా మంది వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఐతే వారిలో ఫైనల్ గా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ప్రియ శెట్టి ఎలిమినేట్ కాబోతుంది. ఐతే తన ఎలిమినేషన్ అసలేమాత్రం ఊహించని ప్రియా శెట్టి చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. బోరున ఏడ్చేసిందని టాక్.
ఫైనల్ గా ఆమె ఎలిమినేట్..
ఐతే బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన ప్రియా ఆట బాగానే అనిపించినా ప్రతి ఇష్యూని పెద్దది చేసి మాట్లాడటం లాంటి విషయాలు ఆమెకు నెగిటివ్ గా మారాయి. లాస్ట్ వీకే ఆమె వెళ్లిపోతుందని అనుకోగా ఫైనల్ గా ఈ వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. కళ్యాణ్, ప్రియా చివరి వరకు నామినేషన్స్ లో ఉండగా.. ప్రియా ఎలిమినేట్ అని తెలియగానే హౌస్ మెట్స్ కూడా అందరు షాక్ అవుతారని తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 9 ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విషయంలో సక్సెస్ అవుతుంది. ప్రతి వీకెండ్ ఎపిసోడ్స్ అయితే మంచి ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్నాయి. ఎలిమినేషన్ అయితే ఎవరు ఊహించని విధంగా జరుగుతున్నాయి.