బిగ్ బాస్ 9.. ఆ ముగ్గురు అది బ్రేక్ చేయాల్సిందే కానీ..?
బిగ్ బాస్ హౌస్ లో ఒక బాండింగ్ ఏర్పరచుకుంటే సేఫ్ అవ్వొచ్చు అనే టాక్ ఉంది. అంటే ఒక స్ట్రాంగ్ బాండింగ్ అది ఫ్రెండ్ షిప్ లేదా లవ్ ఇలా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్లు హౌస్ లో చేసే పనులను ఎంజాయ్ చేస్తారు. కానీ అది వాళ్ల ఆట మీద ఎఫెక్ట్ చేయకూడదు. ఎలాంటి రిలేషన్ పెట్టుకున్నా కూడా అది హౌస్ లో వాళ్ల ఆటని మెరుగుపడేలా చేయాలి. ఐతే బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రం ఒక బాండింగ్ వాళ్ల ఆటని పెంచడం కన్నా గ్రాఫ్ పడిపోయేలా చేస్తుంది.
తనూజా, భరణి నాన్న కూతురు రిలేషన్ తో..
బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణి తన తోటి కంటెస్టెంట్స్ అయిన తనూజ, దివ్యతో ఫ్యామిలీ బాండింగ్ ఏర్పరచుకున్నాడు. తనూజా, భరణి నాన్న కూతురు రిలేషన్ తో హౌస్ లో సందడి చేస్తున్నారు. ఐతే వైల్డ్ కార్డ్ గా వచ్చిన దివ్య కూడా భరణి స్ట్రాంగ్ అని తెలుసుకుని ఆమె కూడా అతనికి క్లోజ్ అవుతూ వచ్చింది. భరణి తో తనూజ, దివ్య ఇద్దరు మంచి ఫ్యామిలీ రిలేషన్ తో ఉన్నారు.
తనూజా భరణిని నాన్న అని పిలుస్తుంటే.. దివ్య మాత్రం ఆయన్ను అన్న లాంటోడంటూ క్లోజ్ అయ్యింది. గత రెండు వారాలుగా తనూజ భరణికి దూరం కాగా దివ్య మరింత దగ్గరై ఆయన విషయంలో ప్రతిదీ చాలా పర్సనల్ గా తీసుకుంటుంది. ఐతే ఇక్కడ విషయం ఏంటంటే తనూజ, దివ్య ఇద్దరి వల్ల భరణి ఆట తగ్గిపోతుంది. తను ఎవరితో ఉన్నా తన ఆట ఏమి డిస్ట్రబ్ కాలేదని పైకి భరణి అంటున్నా తను కూడా ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోయాడని అనిపిస్తుంది.
అయేషా చెప్పినా సరే..
భరణి, తనూజ మధ్యలో దివ్య వచ్చి వాళ్లని దూరం చేసింది. ఇప్పుడు దివ్య కూడా భరణిని అలా ఉండాలి ఇలా ఉండాలని చెబుతుంది. ఈ భరణి ఫ్యామిలీ అనుబంధాల వల్ల ఆట మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వైల్డ్ కార్డ్ గా ఫైర్ స్టోర్మ్ తో వచ్చిన అయేషా అదే విషయాన్ని తనూజకి చెప్పగా భరణికి ఆ విషయం అర్ధమైనట్టు వివరణ ఇచ్చాడు.. కానీ మళ్లీ దివ్యతో ఎమోషనల్ బాండింగ్ తో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురు తమ బాండింగ్ బ్రేక్ చేసి ఆట మీద ఫోకస్ చేస్తే తప్ప హౌస్ లో కొనసాగడం కష్టమని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.
ఈ వారం ఆల్రెడీ దివ్య నామినేషన్స్ లో ఉంది. రాముతో ఆమె డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దివ్య హౌస్ నుంచి వెళ్తే భరణి ఆట మారే ఛాన్స్ ఉంది. మరి భరణి దివ్య ఉన్నా కూడా ఆట మార్చుకుంటేనే ఆయన కూడా హౌస్ లో ఉండే అవకాశం ఉంది లేకపోతే మాత్రం ఆడియన్స్ అతన్ని కూడా ఎలిమినేట్ చేసేలా ఉన్నారు.