బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. విభజించు పాలించు..!

15 మంది అందరికీ కూడా బాక్స్ లో ఫ్రూట్స్ ని ఎంపిక చేసుకోమని చెప్పగా అందులో మనీష్, నాగ ప్రశాంత్, షాకీబ్ గ్రీన్ యాపిల్ ని తీసుకున్నారు.;

Update: 2025-08-29 04:36 GMT

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో టాప్ 15 నుంచి టాప్ 5 ని ఎంపిక చేసే క్రమంలో జ్యూరీ మెంబర్స్ నవదీప్, అభిజిత్, బిందు మాధవి ఇచ్చే టాస్క్ లతో కంటెస్టెంట్స్ అంతా ఇంట్రెస్టింగ్ ఆట ఆడుతున్నారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో భాగంగా ఈరోజు ఎపిసోడ్ లో ఆ టీం లను 3 భాగాలుగా చేసి ఆట ఆడించారు. ఆ సెలక్షన్ కూడా లక్ ని బేస్ చేసుకుని ఆట ఆడించారు. 15 మంది అందరికీ కూడా బాక్స్ లో ఫ్రూట్స్ ని ఎంపిక చేసుకోమని చెప్పగా అందులో మనీష్, నాగ ప్రశాంత్, షాకీబ్ గ్రీన్ యాపిల్ ని తీసుకున్నారు.

ముగ్గురికి గ్రీన్ యాపిల్..

ఈ ముగ్గురు గ్రీన్ యాపిల్ పొందారు కాబట్టి వీళ్ల ముగ్గురు ఈరోజు లీడర్స్ గా ప్రమోట్ అయ్యారు. ఐతే ఈ ముగ్గురు జ్యూరీల దగ్గర మూడు కార్డులు తీసుకుంటారు. అలా షాకీబ్ నవదీప్ కార్డ్.. నాగ ప్రశాంత్ అభిజిత్ దగ్గర కార్డ్ తీసుకోగా బిందు మాధవి కార్డ్ మిగిలిన మనీష్ కి ఇచ్చింది. ఐతే ఆ కార్డ్ లో షాకీబ్ కి 2, నాగ ప్రశాంత్ కి 4, మనీష్ కి 6 నెంబర్ వచ్చింది. దాని వెనక రీజన్ షాకీబ్ టీమ్ లో ఇద్దరు మాత్రమే.. నాగ ప్రశాంత్ టీం లో 4, మనీష్ టీమ్ లో మిగిలిన ఆరుగురిని తీసుకున్నారు.

ఇక ఫైనల్ గా బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో ఈ 3 టీమ్ లకు బ్రెయిన్ గేమ్ తో బెల్ టాస్క్ పెట్టగా అందులో నాగ ప్రశాంత్ టీమ్ గెలిచింది. షాకీబ్, మనీష్ టీమ్ ఓడిపోయింది. ఇక గెలిచిన నాగ ప్రశాంత్ టీమ్ నుంచి ఒకరికి ఓటింగ్ రిక్వెస్ట్ ఛాన్స్ వచ్చింది. నాగ ప్రశాంత్ హరీష్ కి ఆ ఛాన్స్ ఇవ్వాలని అనుకోగా అతను నాగాకే ఇస్తానన్నాడు. ఐతే ప్రియా కి ఫైనల్ గా ఓటింగ్ ఛాన్స్ ఇచ్చారు.

వరస్ట్ ప్లేయర్ మనీష్..

మరోపక్క ఈ ఆటలో మరోసారి వరస్ట్ ప్లేయర్ గా నిలిచాడు మనీష్. అతనికి ఎల్లో కార్డ్ ఇచ్చాడు నవదీప్. ఈ ఎల్లో కార్డ్ రెండుసార్లు ఎవరికైతే ఇస్తారో వాళ్లు బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇక ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నాగ ప్రశాంత్ ని ఎంపిక చేయగా అతనికి స్టార్ ఇచ్చారు. అతనికి కూడా ఓటింగ్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చారు.

మనీష్ టీమ్ ఓడిపోవడానికి అతనే చాలా సార్లు టాస్క్ లకు వెళ్లడం అని అతని టీం మెంబర్స్ అతని మీద అలిగేషన్ వేశారు. తాము వెళ్తామన్నా బ్రెయిన్ గేం అని అతను వెళ్లాడని అన్నారు. అలా కొంత వాళ్ల టీం నుంచి మనీష్ కి డిజప్పాయింట్ వచ్చింది. సో బిగ్ బాస్ కి కావాల్సింది కూడా అదే కాబట్టి అగ్నిపరీక్షకి మంచి క్రేజ్ తెస్తుంది.

Tags:    

Similar News