బిగ్ బాస్ 9.. ఫైర్ ఫైర్స్ ద ఫైర్ రేంజ్ లో గొడవలు..!

బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ వచ్చాక సీన్ మారిపోయింది. ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య కూడా దూరం పెరిగే పరిస్థితి వచ్చింది.;

Update: 2025-10-16 05:17 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ వచ్చాక సీన్ మారిపోయింది. ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య కూడా దూరం పెరిగే పరిస్థితి వచ్చింది. వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా హౌస్ మెట్స్ ని సెపరేట్ చేసే పనిని పెట్టుకున్నారు. ఆల్రెడీ భరణికి క్లోజ్ గా ఉన్న తనూజ, దివ్యాలను దూరం చేసే పనుల్లో ఉన్నారు. ఇటు రీతు, డీమాన్ పవన్ ల మీద కన్నేసి ఉంచారు. హౌస్ లో ఫైర్ మూమెంట్స్ చాలా ఉంటున్నాయి. ముఖ్యంగా దువ్వాడ మాధురి మాత్రం ఏ విషయంలో కూడా తగ్గట్లేదు.

తనతో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి..

ఆల్రెడీ ఫుడ్ మోనిటర్ దివ్యాతో గొడవ జరిగింది.. దానికి కొనసాగింపుగా ఆ గొడవ కొనసాగిస్తూనే ఉన్నారు. హౌస్ లో వైల్డ్ కార్డ్ గా వచ్చి తన డామినేషన్ చూపిస్తున్నారు మాధురి. తనతో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఐతే దివ్యా ఆమె విషయంలో ఎక్కడ తగ్గట్లేదు. మరోపక్క రీతు కూడా మాధురి గొడవకి దిగింది. నైట్ పడుకున్న తర్వాత గుసగుసలు వద్దని మాధురి హౌస్ మెట్స్ కి ఒక తీర్మానం పెట్టగా అది బిగ్ బాస్ రూల్ లో లేదని రీతు అన్నది. ఆ విషయంలో రీతు, మాధురి వాదులాట జరిపారు.

రీతు, మాధురి ఇద్దరు కూడా ఎక్కడ తగ్గలేదు. ఐతే హౌస్ లో మాత్రం వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఎక్కువ వినిపిస్తున్న వాయిస్ ఐతే మాధురిదే అని చెప్పాలి. ఆమె ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్న రేంజ్ లో ప్రతి విషయంలో గొడవ పడుతున్నారు. ఆల్రెడీ హౌస్ లో రియల్ ఫైట్స్ జరుగుతుంటే అది చాలదు అన్నట్టుగా సంజన, మాధురి ఒక స్టిక్కర్స్ ఫ్రాంక్ గొడవ చేశారు. ఆ విషయంలో హౌస్ అంతా కూడా షాక్ అయ్యారు.

అయేషా కూడా బంధాలను బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో..

వైల్డ్ కార్డ్స్ లో వచ్చిన మిగతా వారిలో అయేషా కూడా కిచెన్ లో ఒక బేసిన్ క్లీన్ చేయలేదని రీతు చౌదరి మీద గొడవ పడింది. కావాలని రీతుకి దగ్గరైన డీమాన్ పవన్ తో డ్యాన్స్ చేసింది. హౌస్ లో ఉన్న బంధాలను బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యం తోనే పెద్ద ప్లాన్ తోనే అయేషా ఇలా చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం హౌస్ లో టాస్కుల కన్నా ఈ గొడవలే మెయిన్ హైలెట్ అవుతూ వస్తున్నాయి. మరోపక్క భరణి, తనూజ, దివ్యల మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. దివ్య భరణి దగ్గర తనూజని బ్యాడ్ చేయాలని తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో భరణి, తనూజ, డీమాన్ పవన్, దివ్యా, సుమన్ శెట్టి, రాము ఉన్నారు. ఐతే లీస్ట్ త్రీ పొజిషన్ లో దివ్యా, సుమన్ శెట్టి, రాము ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ నుంచి ఈ వీకెండ్ బయటకు వెళ్తారని చెప్పొచ్చు.

Tags:    

Similar News