బిగ్ బాస్ 9.. వేడెక్కిన హౌస్ వాళ్లిద్దరు మాత్రం..!
హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా దువ్వాడ మాధురి, చిట్టి పికిల్స్ రమ్య వచ్చే సరికి సోషల్ మీడియా అంతా కూడా హడావిడి మొదలైంది.;
బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఆట మరింత రసవత్తరంగా మారింది. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా దువ్వాడ మాధురి, చిట్టి పికిల్స్ రమ్య వచ్చే సరికి సోషల్ మీడియా అంతా కూడా హడావిడి మొదలైంది. ఎక్స్ పెక్టేషన్స్ కి తగినట్టుగానే వాళ్లు హౌస్ లో తమ ఆట తీరుని కొనసాగిస్తున్నారు. మాధురి కిచెన్ చెఫ్ గా ఉండగా ఫుడ్ విషయంలో మోనిటర్ దివ్యా హౌస్ కెప్టెన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకుంది. ఆమె వెటకారపు మాటల వల్ల కళ్యాణ్, దివ్య మాధురి మీద వాదనకి దిగారు. ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా మాట్లాడారు. ఐతే ఆ తర్వాత మాధురి కాస్త కళ్ల వెంట నీరు పెట్టుకుంటే తనూజ, రీతు కన్సోల్ చేశారు.
డీమాన్ పవన్ బుర్ర లేదని కామెంట్స్..
ఇక మరోపక్క చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నామినేషన్స్ టైం లో ఆమె డీమాన్ పవన్, రీతులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి రాగా అందుకు ఆమె డీమాన్ పవన్ ని సెలెక్ట్ చేసి నామినేషన్స్ లో ఉంచింది. దానికి రీజన్ గా నీకు ఏ విషయంలో కూడా బుర్ర లేదని చెప్పింది. అతను క్లారిటీగా అడిగినా కూడా అన్ని విషయాల్లో బుర్ర లేదని అన్నది రమ్య.
మరోపక్క కళ్యాణ్ మాధురి మధ్య డిస్కషన్ టైం లో కూడా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడంటూ సంచలన కామెంట్స్ చేసింది. టీవీ షోలో అలా అనడం వల్ల అతనికి ఎంత బ్యాడ్ అవుతుంది అన్నది ఆమె ఆలోచించలేదు. ఇక తనూజపై వేసినట్టు తనని టచ్ చేస్తే పడేసి తొక్కుతా అంటూ కామెంట్ చేసింది. పక్కన ఉన్న మాధురి కూడా అమ్మాయిలకు గోకడం కరెక్ట్ కాదని అన్నారు.
టచ్ చేస్తే పడేసి తొక్కుతా..
ఐతే సోషల్ మీడియాలో వీరిద్దరి మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా ఆల్రెడీ పికిల్స్ వివాదంలోనే సోషల్ మీడియాలో రమ్య మోక్ష వైరల్ అవగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక కూడా ఆమె కామెంట్స్ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. రమ్య కళ్యాణ్ విషయంలో చేసిన కామెంట్స్ పై ఆడియన్స్ నుంచి కూడా నెగిటివిటీ మొదలైంది.
మరి హౌస్ లో వీరి ప్రయాణం ఎప్పటివరకు సాగుతుందో తెలియదు కానీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కు మాత్రం ఈ సోషల్ మీడియా ట్రోల్స్ కొత్తగా అనిపిస్తున్నాయి.