బిగ్ బాస్ 9.. ఆ కంటెస్టెంట్ తో పెట్టుకుంటే ఎలిమినేట్ అయిపోతారా..?
బిగ్ బాస్ సీజన్ 9లో ఏడవ వారం ఒక క్రేజీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఏడవ వారం ఒక క్రేజీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఈలోగా బిగ్ బాస్ లీక్స్ లో భాగంగానే ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది ముందే తెలిసిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 9లో 7వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో ఒకరు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ గా ఉన్న ఒక కంటెస్టెంట్ ఆ క్రేజ్ తోనే హౌస్ లోకి ఎంటర్ అవ్వగా ఆ ఇంపాక్ట్ ని హౌస్ లో చూపించలేకపోయింది. ముఖ్యంగా ఉన్న రెండు వారాల్లో లాస్ట్ వీక్ మాత్రమే ఆమె హౌస్ లో కాస్త ఓపెన్ అయ్యింది.
బయట ఉన్న క్రేజ్ తో కొన్నాళ్లు హౌస్ లో ఉంటుందని అనుకున్నారు..
ఇంతకీ ఎలిమినేట్ అయ్యింది ఎవరు అంటే సోషల్ మీడియా సెన్సేషన్ అయిన రమ్య మోక్ష. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆమె బయట ఉన్న క్రేజ్ తో కొన్నాళ్లు హౌస్ లో ఉంటుందని అనుకున్నారు. కానీ రెండో వారమే ఆమె తన సొంతింటి బాట పట్టింది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఏడవ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది. ఐతే రమ్య ఎలిమినేషన్ కి రీజన్ అయితే మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తెలుస్తుంది.
హౌస్ లో స్ట్రాంగ్ గా తన ఆట తీరుతో వెళ్తున్న తనూజని రమ్య టార్గెట్ చేసింది. నామినేషన్స్ తప్పు కాదు పోనీ ఏమైనా వాలిడ్ పాయింట్స్ చెప్పిందా అంటే అది లేదు. అంతేకాకుండా కొన్ని అవసరం లేని మాటలు వదిలింది. తనూజ మీద ఫైర్ అవ్వడమే ఆమెను హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది. లాస్ట్ వీక్ ఆల్రెడీ రమ్య తనూజ గురించి వెనక మాట్లాడిన మాటలను ఆమెకు చూపించారు. అయినా కూడా రమ్య తగ్గకుండా ఈ వారం కూడా తనూజనే టార్గెట్ చేసింది.
వైల్డ్ కార్డ్ గా వచ్చి రెండో వారమే హౌస్ నుంచి బయటకు..
సో అలా తనూజ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన రమ్యకి తక్కువ ఓటింగ్స్ రావడంతో హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ గా వచ్చి రెండో వారమే హౌస్ నుంచి బయటకు వెళ్లిన వారి లిస్ట్ లో రమ్య మోక్ష కూడా చేరింది. ఆమెకు వచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ యూజ్ చేసుకుందని చెప్పొచ్చు.
సోషల్ మీడియాలో ఒక ఆడియోతో కాంట్రవర్షియల్ గా మారిన రమ్య మోక్ష హౌస్ లో కూడా అంత గొప్ప ఆట తీరు కనిపించకపోవడమే కాదు వాళ్ల వీళ్ల మధ్య బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చేసింది. ఆడియన్స్ వీటినన్నిటినీ చూసి ఆమెను బయటకు పంపించేశారు. రమ్య ఎలిమినేషన్ తో తనూజని టార్గెట్ చేసిన వాళ్లను ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తున్నారని ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండాలని కంటెస్టెంట్స్ కూడా తమ ఆట తీరు మార్చే ఛాన్స్ ఉంది.