• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : కింగ్ నాగ్...

బిగ్ బాస్ 8 : కింగ్ నాగ్ ఈజ్ ఆన్ ఛార్జ్.. ఒక్కొక్కరి గుడ్లు పగిలిపోయాయి..!

| ఈ వారం జరిగిన గుడ్ల టాస్క్ గురించి నాగార్జున హౌస్ మెట్స్ అందరితో మాట్లాడాడు. ముఖ్యంగా అభయ్ నవీన్ పై హోస్ట్ నాగార్జున తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

By - Tupaki Desk
Update: 2024-09-22 03:45 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో శనివారం ఎపిసోడ్ వచ్చింది అంటే కింగ్ నాగార్జున ఎలా హౌస్ మెట్స్ మీద ఫైర్ అవుతారని ఆసక్తిగా ఎదురుచూస్తారు. వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడిన ఆటకు వీకెండ్ లో హోస్ట్ నాగార్జున ఇచ్చే రివ్యూ అదిరిపోతుంది. ఇక హౌస్ లో ఎవరు కాస్త అతి చేసినా ఎవరు ఆటలో ఫౌల్ ఆడినా ఇలా అన్ని అంశాలను ప్రస్తావిస్తూ నాగార్జున అడుగుతారు కడుగుతారు.

ఈ వారం జరిగిన గుడ్ల టాస్క్ గురించి నాగార్జున హౌస్ మెట్స్ అందరితో మాట్లాడాడు. ముఖ్యంగా అభయ్ నవీన్ పై హోస్ట్ నాగార్జున తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ బిగ్ బాస్ మీద ఎటాక్ చేసిన అభయ్ కు తను మాట్లాడిన మాటలన్నీ చూపించి మరీ రెడ్ కార్డ్ చూపించి తక్షణమే హౌస్ లో నుంచి బయటకు వెళ్లాలని నాగార్జున అన్నాడు. ఐతే మిగతా హౌస్ మెట్స్ తో పాటు అభయ్ కూడా ఇలాంటిది మరోసారి రిపీట్ అవ్వదని చెప్పడంతో ఫైనల్ గా క్షమించారు.

అంతేకాదు ప్రేరణ, విష్ణు ప్రియ మధ్య జరిగిన గొడవని కూడా మణికంఠ హైలెట్ చేశాడని అతన్ని కన్ ఫెషన్ రూం లోకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. యష్మిని మణికంఠ హగ్ చేసుకోవడం గురించి ఆమె బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేయగా దాని గురించి నాగార్జున మణికంఠను మందలించాడు. ఇక ప్రేరణ, విష్ణు ప్రియల మధ్య జరిగిన దోశ వీడియో చూపించి వారి డౌట్లు క్లారిఫై చేశారు.

ఇక వీక్ మొత్తం ఆడిన గుడ్ల టాస్క్ ను పోల్చుతూ ఎవరు బాగా ఆడారో వారి గుడ్డుని పగలగొట్టకుండా బాగా ఆడని వారి గుడ్డుని పగలగొట్టారు. నిఖిల్ తప్ప అందరి గుడ్లను నాగార్జున పగలగొట్టారు. ఐతే ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉండగా ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. బిగ్ బాస్ లీక్స్ ప్రకారం అభయ్ నవీన్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్టు సమాచారం. ఈ వారం జరిగిన గుడ్ల టాస్క్ వల్ల హౌస్ మెట్స్ మధ్య చాలా వాదనలు జరిగాయి కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కు తప్పకుండా ఈ రీజన్స్ నే ప్రధానంగా తీసుకుంటారని చెప్పొచ్చు.

Tags:    
  • Biggboss8 
  • Nagarjuna 
  • Contestants 
  • Prerana 
  • Vishnupriya 
  • Abhaynaveen 
  • Manikanta 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS