రిలీజ్ కు ముందే నెగిటివ్ ప్రచారం త‌గునా?

వెబ్ సిరీస్ స్టార్లే ఇప్పుడు బాలీవుడ్ లో చ‌క్రం తిప్పుతున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సిరీస్ ల‌తో ఎంట‌ర్ అయి సినిమాల‌కు ఈజీగా ప్ర‌మోట్ అవుతున్నారు.;

Update: 2025-11-20 03:14 GMT

వెబ్ సిరీస్ స్టార్లే ఇప్పుడు బాలీవుడ్ లో చ‌క్రం తిప్పుతున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సిరీస్ ల‌తో ఎంట‌ర్ అయి సినిమాల‌కు ఈజీగా ప్ర‌మోట్ అవుతున్నారు. త‌మ ట్యాలెంట్ అంతా వెబ్ సిరీస్ ల‌తో ప్రూవ్ అవుతుంది. సినిమాల‌ను మించిన బ‌ల‌మైన పాత్ర‌ల‌తో అక్క‌డ రాటు దేల‌ద‌డంతో వెండి తెర అవ‌కాశాలు సుల‌భ‌మ వుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో వెబ్ సిరీస్ స్టార్ భువన్ భామ్ బాలీవుడ్ కి ప‌రిచ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

`కుక్కు కీ కుందాలి` అనే సినిమాతో లాంచ్ అవుతున్నాడు. ఇందులో అవ‌కాశం ఇచ్చింది ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్.

త‌న సొంత బ్యాన‌ర్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లోనే ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ సంస్థ‌లో చాలా మంది స్టార్ల‌ను ప‌రిచ‌యం చేసిన క‌ర‌ణ్ భువ‌న్ భామ్ బాధ్య‌త‌లు కూడా తీసుకోవడం విశేషం. రొమాన్స్ -కామెడీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. క‌థ‌లో రొమాన్స్ కు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్నారు. భువ‌న్ కు జోడీగా వామికా గ‌బ్బి న‌టిస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌కు ఏ మాత్రం కొద‌వ‌లేద‌న్న‌ది టాక్. క‌థ‌లో ఓ భూతం పాత్ర కూడా ఉందని స‌మాచారం. సినిమాలో ఈ పాత్ర ఓ ట్విస్ట్ లా ఉంటుంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే ఇందులో న‌టిస్తోన్న భువ‌న్ భామ్ పై అప్పుడే నెగిటివ్ ప్ర‌చారం మొద‌లైంది. భువ‌న్ భామ్ కి సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వెబ్ సిరీస్ ల ద్వారా అంత గొప్ప క్రేజ్ సాధ్య‌మైంది. `టిక్ టాక్స్`, `తాజా ఛబర్`, `ధిండోరా`, `తాజ్ కా బార్`, `ది రివెల్యూష‌న‌రీస్` లాంటి వెబ్ సిరీస్ లు మంచి స‌క్స‌స్ సాధించ‌డంతో? నెట్టింట బాగా పాపుల‌ర్ అయ్యాడు. అత‌డి న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. వైవిథ్య‌మైన పాత్ర‌లతో అన్ని భాష‌ల‌కు క‌నెక్ట్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలోనే ఆ క్రేజ్ గుర్తించి క‌ర‌ణ్ జోహార్ వెండి తెర‌కు తీసుకొస్తున్నాడు.

కానీ ఈ చిత్రం భువ‌న్ భామ్ రీచ్ ను పెద్ద‌గా పెంచ‌లేద‌నే క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. వెండి తెర హీరోగా భువ‌న్ కి ఈ సినిమా ఎంత కీల‌క‌మో? నిర్మాత‌గా క‌ర‌ణ్ జోహార్ కి స‌క్స‌స్ అంతే అనివార్యం. కానీ లీకైన అంశాల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాకు పెద్ద‌గా బ‌జ్ లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రంపై ఇలాంటి ప్రచారం ఏ కార‌ణంగా మొద‌లైంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News