• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  6 ఏళ్లు ఫ్యామిలీకి దూరంగా...

6 ఏళ్లు ఫ్యామిలీకి దూరంగా హీరోయిన్..!

| చైతన్య రావు హీరోగా కుమార స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా షరతులు వర్తిస్తాయి.

By - Tupaki Desk
Update: 2024-03-17 12:36 GMT

చైతన్య రావు హీరోగా కుమార స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది కన్నడ భామ భూమి శెట్టి. సీరియల్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ అందుకుంది అమ్మడు. చైతన్య రావుతో కలిసి చేసిన షరతులు వర్తిస్తాయి సినిమా ప్రమోషన్స్ లో తన గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది భూమి శెట్టి.


కర్ణాటకలో రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న భూమి శెట్టి జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే ఇంట్లో వాళ్లు తనకు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఇంజనీరింగ్ చదువుకోవాలని తనకు ఉన్నా డిగ్రీ చదువుకుని పెళ్లి చేసుకో కాదని బెంగుళూరు వెళ్తే నీతో మాట్లాడని ఇంట్లో వాళ్లు చెప్పారట. అయినా సరే ఇంట్లో వాళ్ల మాటలను కాదని భూమి బెంగుళూరు వచ్చేసిందట. చదువుతున్న రోజుల్లోనే మ్యాగజైన్ లో ఫోటో షూట్ లో పాల్గొన్న అమ్మడు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాక సీరియల్ లో అవకాశాలు వచ్చిందని చెప్పింది. ఒక రియాల్టీ షోలో ఫ్యామిలీకు క్షమాపణలు చెప్పడంతో అప్పటి నుంచి వాళ్లు మాట్లాడటం మొదలు పెట్టారని చెప్పుకొచ్చింది భూమి శెట్టి.

దాదాపు ఆరేళ్లుగా ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదని.. ఆ టైం లో తనకు తానే చాలా స్ట్రాంగ్ గా మారానని చెప్పింది భూమి. ఇక తన కలర్ విషయంలో కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. ఎన్నోసార్లు బాధపడ్డాను.. ఫంక్షన్స్ కు వెళ్లేదాన్ని కాదు.. ఇలా ఉంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు.. తెల్లగా మారడానికి ఏదైనా వాడొచ్చు కదా అంటూ చెప్పేవారు. ఇన్ స్టాలో ఫోటోస్ షేర్ చేసినా ఇప్పటికీ నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తారు. అయితే ఆ కామెంట్స్ ని తాను అసలు పట్టించుకోనని.. తాను ఎంత అందంగా ఉన్నానో తనకు తెలుసని అన్నారు భూమి.

నిజం చెప్పాలంటే సినిమాల్లో రాణించాలంటే కలర్ తో పనిలేదు. యాక్టింగ్ లో తమ టాలెంట్ చూపిస్తే చాలు అవకాశాలు అవే వచ్చేస్తాయి. సినిమాల్లోకి వచ్చే వారు ఇలా కలర్ తక్కువ అని ఆలోచిస్తే గొప్ప నటీనటులు తెర మీద అలరించే వారు కాదు. ప్రతిభ ఉండాలే కానీ సినిమా పరిశ్రమలో కలర్ అనేది అసలు మ్యాటర్ కాదని కొంతమంది స్టార్స్ ఇప్పటికే ప్రూవ్ చేశారు. వారి దారిలోనే భూమి శెట్టి తన నటనతో మెప్పించాలని చూస్తుంది.

Tags:    
  • Bhumishetty 
  • Actress 
  • Filmindsutry 
  • Chaitanyarao 
  • Kumarswamy 
  • Family 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS