• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భీమా బాక్సాఫీసు ఊచకోత.....

భీమా బాక్సాఫీసు ఊచకోత.. థియేటర్స్ లో విజల్స్ మోత గ్యారెంటీ..!

| ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాచో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా వుంది

By - Tupaki Desk
Update: 2024-03-03 07:05 GMT

టాలీవుడ్ మాస్ కటౌట్ లో ఒకరైన గోపీచంద్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా భీమా. కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె కె రాధామోహన్ నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ తో ఈసారి మాస్ ఫీస్ట్ పక్కా అనేలా చేసిన గోపీచంద్ భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే కాన్ఫిడెంట్ తో కనిపించారు. మార్చి 8 శివరాత్రి సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య అతిథులుగా వచ్చారు. గోపీచంద్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొన్న భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాచో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి , పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్ష ని పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బావుటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను... కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నిర్మాత రాధామోహన్ గారికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయనే. చాలా గ్రాండ్ గా నిర్మించారు. కో స్టార్స్ మాళవిక, ప్రియ, ఈ సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా వేరే లెవల్ లో కొట్టాడు. రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ చాలా ఎక్స్ ట్రార్డినరీ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి. అజ్జు చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. తను చాలా మంచి రైటర్ అవుతాడు.

ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి థాంక్స్. ఈ వేడుకకు సహకరించిన పోలీసులకు, కాలేజ్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

దర్శకుడు ఏ హర్ష మాట్లాడుతూ.. భీమా పేరు వింటేనే పవర్ మాస్ ఎనర్జీ. ఈ కథని గోపీచంద్ గారికి చెప్పే అవకాశం కల్పించిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు. గోపిచంద్ గారికి కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైయింది. భీమాలో ఎనర్జీ పవర్ వుంది, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో మొదలుపెట్టాం. గోపి గారు వండర్ ఫుల్ పర్శన్. చాలా హంబుల్ గా వుంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. మీ వందశాతం ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అజ్జు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. మార్చి8న తప్పకుండా థియేటర్స్ లోనే చూడండి. థియేటర్స్ లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇదని అన్నారు.

హీరోయిన్ మాళవిక శర్మ .. ఈ సినిమాలో విద్య అనే మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు హర్షకి థాంక్స్. ఆయన చాలా విషయాలు నేర్పించారు. నిర్మాత రాధమోహన్ గారికి ధన్యవాదాలు. గోపిచంద్ గారు వండర్ ఫుల్ కో స్టార్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మార్చి 8న సినిమా వస్తుంది. తప్పకుండా థియేటర్స్ లో చూడాలని కోరారు.

డైలాగ్ రైటర్ అజ్జు మహంకాళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు హర్షకి ధన్యవాదాలు. గోపీచంద్ గారు చాలా పాజిటివ్ గా వుంటారు. నవ్వుతూ వుంటారు. మార్చి 8న భీమా తాండవం చూస్తారు. గూస్ బంప్స్ కి కేరాప్ అడ్రస్ గోపీచంద్ గారి సినిమాలు. రోమాలు గునపాలు అవుతాయి. దర్శకుడు చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఈ సినిమాలో యాక్షన్ అవకాయలా వుంటుంది. సోల్ వెన్నపూస లా వుంటుంది. టీం అందరికీ ధన్యవాదాలు. మార్చి 8న బాక్సాఫీసు ఊచకోత, థియేటర్స్ లో విజల్స్ మోత. ఇది గ్యారెంటీ అన్నారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గోపీచంద్ గారు నటించిన వర్షం సినిమా వరంగల్ లోనే చిత్రీకరణ జరుపుకుంది. చాలా అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ వున్నాయి. షూటింగ్స్ కి అనుకూలంగా వుంటాయి. ప్రభుత్వం తరపున ఇక్కడ సినీ పరిశ్రమకు అన్ని సహాయ సహకారాలు వుంటాయి. శివరాత్రిన వస్తున్న ఈ సినిమాని తప్పకుండా చూస్తాను. మీరంతా చూడాలని కోరుకుంటున్నానన్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి , పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. భీమాని మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం అందరూ టీం గా పని చేశారు. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో కామెడీ యాక్షన్ ఎంటర్ టైమెంట్ యాక్షన్ అన్ని రకాలు కలసి వున్న సినిమా భీమా. అందరూ థియేటర్స్ లో చూసి అభినందిస్తారని భావిస్తున్నాను. రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్ చక్రవర్తి తో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Tags:    
  • Machostar 
  • Gopichand 
  • Bhimaamovie 
  • Bhimaaprerelease 
  • Directorharsha 
  • Filmindustry 
  • Bhimma 
  • Malavikasharma 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS