• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆహా.. ప్రియమణి మరో క్రేజీ...

ఆహా.. ప్రియమణి మరో క్రేజీ మూవీ

| ఈ పోస్టర్ ఎంతో విభిన్నంగా ఆకట్టుకుంటోంది. ఇక రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో రూపొందిస్తున్న మేకర్స్ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-23 13:25 GMT

సీనియర్ హీరోయిన్ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్నమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుంటున్న విధానం ఆమె కెరీర్ కు చాలా హెల్ప్ అవుతోంది. సినిమాలలో పవర్ఫుల్ ముఖ్యమైన పాత్రలలో ఎక్కువగా కనిపిస్తున్న ప్రియమణి అప్పుడప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు ఆమె ఇండియాలో నెంబర్ వన్ లోకల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'ఆహా' స్టూడియోలో మరో సినిమా చేస్తోంది.


తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే ఉన్న ఆహా ఇప్పుడు థియేట్రికల్ సినిమాలలో కూడా భాగం అవుతోంది. ఇక ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామా కలాపం' సినిమా ఇంతకుముందు ఆహాలో స్ట్రీమింగ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా మేకర్స్ డ్రీమ్ ఫార్మర్స్ అదే కథకు కొనసాగింపుగా 'భామా కలాపం 2'ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

మొదటి భాగం కంటే ఇప్పుడు అంతకుమించి అనేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ ఫ్రాంచైజీ రూపొందుతోంది. విభిన్నమైన ఎమోషన్స్‌తో ఇదొక మంచి ఎంటర్టైన్మెంట్ డోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక 'భామా కలాపం 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది.

ఈ పోస్టర్ ఎంతో విభిన్నంగా ఆకట్టుకుంటోంది. ఇక రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో రూపొందిస్తున్న మేకర్స్ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రియమణి మొదట నటించిన 'భామాకలాపం' ను డ్రీమ్ ఫార్మర్స్ నిర్మించింది. ఈ సంస్థలో విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'తో మరో సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

అయితే అదే సంస్థ 'భామా కలాపం 2'తో మరో చక్కటి సినిమాను అందించనున్నారు. త్వరలోనే ఇది థియేటర్స్‌లో విడుదల కావటానికి రెడీ అవుతోంది. ఆహా స్టూడియోస్ కూడా డ్రీమ్ ఫార్మర్స్‌తొ సంయుక్తంగా రూపొందిస్తోన్న 'భామా కలాపం 2'లో మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా బిగ్ క్యాస్టింగ్ ఉండేలా ప్లాన్ చేశారట. మూవీపై మంచి అంచనాలు ఏర్పడేలా అప్డేట్స్ ఉంటాయని అంటున్నారు. ఇక ప్రియమణి లీడ్ రోల్ లో కనిపించబోతుండగా శీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అభిమన్యు తాడిమేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు.

Tags:    
  • Priyamani 
  • Bhamakalapam2 
  • Bhamakalapam2movie 
  • Aha 
  • Ott 
  • Firstlook 
  • Poster 
  • Abhimanyutadimeti 
  • Dreamfarmers 
  • Ahastudios 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS