భైరవం ఫస్ట్ కాపీ.. అవుట్ పుట్ తో టీమ్ ఫుల్ హ్యాపీ!

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న భైరవం మూవీ మే 30న విడుదల కానుంది.;

Update: 2025-05-27 08:03 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెయిన్ రోల్ లో నటిస్తున్న మూవీ భైరవం. మరో ఇద్దరు హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించిన ఆ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళంలో సూరి హీరోగా వచ్చిన గరుడన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కించారు.

మెయిన్ కాన్సెప్ట్ ను తీసుకుని తెలుగు నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రూపొందించిన ఆ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ గ్రాండ్ గా నిర్మించారు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించారు. జయసుధ, అజయ్, సందీప్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న భైరవం మూవీ మే 30న విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే భావన అందరిలో ఉంది.

హీరోలు శ్రీనివాస్, మనోజ్, రోహిత్.. భైరవంతో గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని అంతా అంచనా వేస్తున్నారు. అయితే రీసెంట్ గా మూవీ టీమ్.. భైరవం ఫైనల్ కాపీని చూసింది. అవుట్‌ పుట్‌ తో చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్న సాయి శ్రీనివాస్ కేక్ ను కట్ చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ విజయ్ సహా పలువురికి కేక్ తినిపించారు. అనంతరం మార్క్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. వివిధ రకాల బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. మూవీతో హిట్ కొట్టనున్నామనే సంతోషం.. బెల్లంకొండ ముఖంలో బాగానే కనిపిస్తుంది.

కాగా, ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాగా, సభ్యులు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని టాక్ వినిపించింది. మెయిన్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటనకు విజిల్స్ పడతాయని చెప్పారట. అయితే మే 30న పెద్దగా సినిమాల రిలీజులు లేవు.. కాబట్టి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు.. భైరవం దూసుకుపోవడం పక్కా. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News