మంచు మనోజ్.. మోహన్ బాబు ఇచ్చిన ఆస్తి ఇదే!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ సినిమాతో ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.;

Update: 2025-06-01 12:40 GMT

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ సినిమాతో ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. తన యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. కమ్ బ్యాక్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు మంచు మనోజ్.

అదే సమయంలో రీసెంట్ గా మేకర్స్.. క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో మంచు మనోజ్ కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. సినిమాలో మీ వాయిస్, డిక్షన్, మేనరిజం మోహన్ బాబుతో సిమిలర్ గా అనిపించింది! కావాలని చేశారా? లేకుంటే ఇన్ బిల్ట్ గా వచ్చిందా అనే ప్రశ్న మనోజ్ కు ఎదురైంది.

దీంతో అది డీఎన్ ఏ అని మనోజ్ తెలిపారు. ఆయన (మోహన్ బాబు) దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి అని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మనోజ్ కామెంట్ కూడా ట్రెండ్ అవుతోంది. కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో వివిధ పరిణామాలు జరగ్గా.. ఆయన ఆన్సర్ ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి.

అయితే తనను అంతా ఎంతో గొప్పగా ఆదరించారని మనోజ్ చెప్పారు. ఆడియన్స్ కు థ్యాంక్స్ తెలిపారు. సినిమా స్టార్టింగ్ నుంచి తమ టీమ్ కు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ కు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా మళ్లీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నట్లు వెల్లడించారు మనోజ్. సినిమాలో తన ఇంట్రడక్షన్ కు వస్తున్న రెస్పాన్స్ కు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అది ఒక స్పెషల్ ఫీలింగ్ అని తెలిపారు. సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక మంది పోస్ట్ చేసిన వీడియోస్ చూశానని, చాలా హ్యాపీగా ఉందన్నారు.

తాను సినిమాలో చేసి గజపతి క్యారెక్టర్‌ కు చాలా డెప్త్ ఉందని చెప్పారు మనోజ్. ముఖ్యంగా డబ్బింగ్‌ కోసం కష్టపడినంత ఏ సినిమాకు ఇప్పటి వరకు కష్టపడలేదని తెలిపారు. డైరెక్టర్ గారు చాలా పవర్‌ఫుల్‌ గా తన క్యారెక్టర్ డిజైన్ చేశారని కొనియాడారు. భైరవంతో ముగ్గురు హీరోలకు కూడా సమానంగా పేరు వచ్చిందని, ఆ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ గారికే దక్కుతుందని మనోజ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News