• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య ఫ్యాన్స్​కు...

బాలయ్య ఫ్యాన్స్​కు బ్యాడ్​ న్యూస్​..

| అయితే ఇప్పుడా చిత్రం విడుదల కావట్లేదని తెలిసింది. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బాలయ్య అభిమానులకు నిరాశ ఎదురైంది.

By - Tupaki Desk
Update: 2023-08-30 05:45 GMT

ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో నందమూరి బాలకృష్ణ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఆయన గతంలో నటించిన సూపర్ క్లాసిట్​ హిట్ సినిమా భైరవద్వీం ఆగస్ట్​ 30న రిలీజ్ అవ్వాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం విడుదల కావట్లేదని తెలిసింది. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బాలయ్య అభిమానులకు నిరాశ ఎదురైంది.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ జానపద చిత్రంలో రోజా హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రానికి మాధవ పెద్ది సురేష్‌ సంగీతం అందించారు. 1994లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా .. 9 నంది పురస్కారాల్ని గెలుచుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

అయితే ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్​లో భాగంగా.. ఈ భైరవద్వీపం సినిమాకు ఆధునిక హంగులు అద్ది 4కె రిజుల్యూషన్‌తో నేడు (ఆగస్టు 30)న రీ రిలీజ్‌ చేసేందుకు రెడీ అయ్యారు అభిమానులు, మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ క్లాప్స్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానర్​ స్పెషల్ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు బాగా ఎదురుచూశారు.

అయితే ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్​ వల్ల రీరిలీజ్​ను ఆపేసినట్లు తెలిసింది. దాన్ని రీషెడ్యూల్​ చేసి నవంబర్ నెలకు విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే బాలకృష్ణ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. 'చెన్న కేశవరెడ్డి', 'నరసింహనాయుడు' విడుదలై ఫ్యాన్స్​ను అలరించాయి.

ఇకపోతే బాలయ్య ప్రస్తుతం హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్‌ కేసరి' అనే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా కాజల్ అగర్వాల్ నటించగా.. మరో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. శరత్​ కుమార్​ మరో ప్రధాన పాత్రలో నటించారు.

Tags:    
  • Nandamuribalakrishna 
  • Nbk 
  • Balayyafans 
  • Tollywood 
  • Bhairavadeepam 
  • Rerelease 
  • Chennakeshavareddy 
  • Narasimhanaidu 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS