ర‌ష్మిక‌- కీర్తిని క‌లిపితే పుట్టుకొచ్చిన వెర్ష‌న్ భాగ్య‌శ్రీ‌

ర‌వితేజ స‌ర‌స‌న 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' సినిమాలో న‌టించిన భాగ్య‌శ్రీ బోర్సే, ఆ త‌ర్వాత రామ్ స‌ర‌స‌నా 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే చిత్రంలో న‌టిస్తోంది.;

Update: 2025-07-28 04:10 GMT

ర‌వితేజ స‌ర‌స‌న 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' సినిమాలో న‌టించిన భాగ్య‌శ్రీ బోర్సే, ఆ త‌ర్వాత రామ్ స‌ర‌స‌నా 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇది ఇంకా రిలీజ్ కి రావాల్సి ఉంది. భాగ్య‌శ్రీ విశాల‌మైన క‌ళ్లు, అంద‌చందాల‌కు రామ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

భాగ్య‌శ్రీ అంద‌మైన క‌ళ్లు.. చురుకైన చూపులు.. మ‌తి చెడే స్మైల్ కి ప‌డిపోని వాడు ఉంటాడా? ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఈ భామ `కింగ్‌డ‌మ్‌`లో న‌టించింది. దేవ‌ర‌కొండ‌తో భాగ్య‌శ్రీ కెమిస్ట్రీ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది. సీరియ‌స్ ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామాలో భాగ్య‌శ్రీతో దేవ‌ర‌కొండ ప్రేమ‌క‌థ‌, రొమాన్స్ యూత్ కి బిగ్ రిలీఫ్ గా ఉండ‌నుంది.

నిన్న ట్రైల‌ర్ లాంచ్ వేడుక త‌ర్వాత భాగ్య‌శ్రీ ఈరోజు తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశుని సంద‌ర్శించి పూజ‌లాచ‌రించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. ఇక భాగ్య‌శ్రీ చీర‌క‌ట్టులో చూడ‌గానే ఎంతో అందంగా ఉంద‌ని ప్ర‌శంసిస్తున్న ఫ్యాన్స్, త‌న‌ను చూడ‌గానే కీర్తి సురేష్‌- ర‌ష్మిక‌ల‌ను క‌లిపి చూసిన‌ట్టుగా ఉంద‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. భాగ్య‌శ్రీ నేచుర‌ల్ బ్యూటీ అంటూ విప‌రీతంగా పొగిడేస్తున్నారు.

Tags:    

Similar News