భాగ్య శ్రీ డ్రీమ్ రోల్ అరుంధతిలో జేజమ్మ!
నటీనటులందరికీ కొన్ని డ్రీమ్ రొల్స్ అంటూ కొన్ని ఉంటాయి. వాటిలో అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.;
నటీనటులందరికీ కొన్ని డ్రీమ్ రొల్స్ అంటూ కొన్ని ఉంటాయి. వాటిలో అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కొన్నిసార్లు ఆ ఛాన్స్ లు రావొచ్చు. రాకుండానే రిటైర్మెంట్ కూడా తీసుకొవచ్చు. అలాంటి డ్రీమ్ రోల్స్ నెరవేరాలంటే పరిశ్రమలో వారి సామర్ధ్యంతో పాటు, అదృష్టం కూడా కలిసి రావాలి. కొంత మంది విషయంలో ట్యాలెంట్ లేకపోయినా? లక్కీగా ఛాన్సులందుకుంటారు. చందమామ కాజల్ అగర్వాల్ `మగధీర` సినిమాలో గొప్ప యువరాణి పాత్ర పోషిస్తుందని తానెప్పుడు ఊహించి ఉండదు. అలా కెరీర్ ఆరంభంలోనే ఆమెకు మిత్రవింద పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
వాళ్లంతా లక్కీ హీరోయిన్లే:
ఆ తర్వాత ఆ పాత్ర ఎంతో మంది నటీమణులకు డ్రీమ్ రోల్ గా మారింది. కాజల్ తర్వాత పరిశ్రమకు వచ్చిన చాలా మంది హీరోయిన్లు మిత్రవింద లాంటి పాత్ర పోషించాలని ఉందని ఓపెన్ అయ్యారు. అలాంటి అవకాశం వచ్చిన వారు అదృష్టవంతులు. రాని వారు దురదృష్ట వంతులు. ఆ సంగతి పక్కన బెడితే? తాజాగా ముంబై బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే కూడా తన డ్రీమ్ రోల్ గురించి ఓపెన్ అయింది. `అరుంధతి` సినిమాలో అనుష్క పోషించిన జేజమ్మ లాంటి పాత్ర పోషించాలని ఉందని తెలిపింది. అలాంటి రోల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.
భాగ్య డ్రీమ్ నెరవేరేనా?
విలక్షణ నటిగా పేరు రావాలి? అంటే అలాంటి పాత్రలతోనే సాధ్యమవుతుందని తెలిపింది. తాను ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకున్నా? అందులో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటానంది. అయితే కొన్నిసార్లు తాను అనుకున్న పాత్రలు రానప్పటికీ రకరకాల కారణాలతో పని చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే? గిరి గీసుకుని పని చేస్తే పనవ్వదు. ఫలానా పాత్ర వచ్చే వరకూ నటించను. ఖాళీగా ఉంటాను? అంటే ఎప్పటికీ ఖాళీగానే ఉంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ, తాను మెచ్చే పాత్రల కోసం ప్రయత్నిస్తూ ఉంటేనే ఛాన్సులొస్తాయి. మరి భాగ్య శ్రీ బోర్సే భవిష్యత్ ప్రయాణం ఎలా సాగుతుంది? అన్నది చూడాలి.
ఆశలన్నీ ఆంధ్రా కింగ్ పైనే:
భాగ్య శ్రీ బోర్సే గతేడాది `మిస్టర్ బచ్చన్` తో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇంత వరకూ అమ్మడి ఖాతాలో ఒక్క హిట్ సినిమా లేదు. తొలి సినిమా `మిస్టర్ బచ్చన్` ప్లాప్ అయింది. అటుపై విజయ్ దేవరకొండ సరసన `కింగ్ డమ్` లో నటించింది. ఈసినిమా కూడా తేలిపోయింది. ఇటీవలే అమ్మడు నటించిన కాంత కూడా రిలీజ్ అయింది. ఇందులో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించినా? ఆశించిన ఫలితరాలేదు. ఈసినిమాపై భాగ్య చాలా ఆశలు పెట్టుకుంది కానీ పనవ్వలేదు. త్వరలో `ఆంధ్రా కింగ్ తాలూకా`తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా హిట్ పై చాలా ఆశలు పెట్టుకుంది. మరేం జరుగుతుందన్నది చూడాలి.