• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భగవంత్ కేసరి కలెక్షన్స్.....

భగవంత్ కేసరి కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..

| బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొన్న మూవీ భగవంత్ కేసరి.

By - Tupaki Desk
Update: 2023-11-06 10:23 GMT

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొన్న మూవీ భగవంత్ కేసరి. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ తో నడుస్తోంది. రిలీజ్ అయ్యి 18 రోజుల్లో ఈ మూవీ ఏకంగా 139.19 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

శ్రీలీల ఈ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేసింది. బాలయ్య స్టైల్ గా కంప్లీట్ యాక్షన్ కాకుండా అనిల్ స్టైల్ పూర్తిస్థాయిలో కమర్షియల్ కామెడీ జోనర్ లో కాకుండా ఈ సినిమాని డిఫరెంట్ గా ట్రై చేశారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ తెరకెక్కింది. బోయపాటి తర్వాత బాలయ్యకి ఇంకెవరు హిట్స్ ఇవ్వలేరనే నెగిటివ్ టాక్ కి అనిల్ రావిపూడి బ్రేక్ చేశాడు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ మూవీకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 57.63 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ భగవంత్ కేసరిపై జరిగింది. ఇప్పటి వరకు షేర్ పరంగా చూసుకుంటే 70.01 కోట్లు కలెక్షన్స్ అందుకుంది. గ్రాస్ లెక్కల ప్రమారం చూసుకుంటే 139.19 కోట్లు 18 రోజుల్లోనే సాధించింది.

లాంగ్ రన్ లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని మాట వినిపిస్తోంది. బాలయ్య నుంచి చివరిగా వచ్చిన మూడు సినిమాలు వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ సినిమా క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట.

బాలయ్య స్పీడ్ చూస్తుంటే బాబీ దర్శకత్వంలో మూవీతో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ నుంచి రాబోతోన్న మూవీ ఇదే కావడం విశేషం.

Tags:    
  • Bhagwantkesari 
  • Balkrishna 
  • Thaman 
  • Sreeleela 
  • Anilravipudi 
  • Harispedi 
  • Shinescreens 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS