• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాతీయ ఉత్త‌మ న‌టుడు అల్లు...

జాతీయ ఉత్త‌మ న‌టుడు అల్లు అర్జున్.. ఉత్త‌మ చిత్రం రాకెట్రీ..

| 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించారు.

By - Tupaki Desk
Update: 2023-08-24 13:01 GMT

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించారు. పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా.. గంగూబాయి కతియావాడి, మిమీ చిత్రాలకు గాను అలియా భట్ - కృతి సనన్ సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది.

జాతీయ చలనచిత్ర అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. వీటిని దేశవ్యాప్తంగా ఉత్తమ సినిమాల‌ను వాటిలో న‌టించిన క‌ళాకారుల‌ ప్రతిభను గౌరవించేందుకు, సాంకేతిక నిపుణుల ప్ర‌జ్ఞ‌కు గుర్తింపు నిచ్చేందుకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రకారం జాతీయ చలనచిత్ర అవార్డులు ''సౌందర్యం సాంకేతిక నైపుణ్యం .. సామాజిక ఔచిత్యం కలిగిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఈ సంవత్సరం జై భీమ్, మిన్నల్ మురళి, తలైవి, సర్దార్ ఉదం, 83, పుష్పా ది రైజ్, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, గంగూబాయి కతియావాడి , నాయట్టు, రాకెట్రీ వంటి అనేక చిత్రాలు అవార్డుల కోసం పోటీ ప‌డ్డాయి.

గ‌త అవార్డుల్లో సూర్య‌- అప‌ర్ణ బాల‌ముర‌ళి..68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తమిళ చిత్రం సూరరై పొట్రు (ఆకాశం నీ హ‌ద్దురా) ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది - ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ , ఉత్తమ నటుడు- సూర్య‌, ఉత్తమ నటి అపర్ణా బాలమురళి, ఉత్తమ సంగీత దర్శకత్వం (స్కోర్) GV ప్రకాష్ కుమార్, ఉత్త‌మ స్క్రీన్ ప్లేకి సుధా కొంగర అవార్డులు అందుకున్నారు.

స్క్రీన్ ప్లే తో పాటు ఈ చిత్రానికి సుధ కొంగ‌ర‌ దర్శకత్వం కూడా వహించారు. సూర్య తన ఉత్తమ నటుడి విజయాన్ని తానాజీ న‌టుడు అజయ్ దేవగన్‌తో షేర్ చేసుకున్నాడు. ఆశా పరేఖ్‌ను 2022లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు.

Tags:    
  • Alluarjun 
  • Nationalbestactor 
  • Bestfilm 
  • Rocketry 
  • Aliabhatt 
  • Kritisanon 
  • Pushpamovie 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS