ఛత్రపతి రీమేక్ నేర్పిన పాఠం..!
ఐతే సినిమా చేశాక అతనికి అసలు నిజం ఏంటన్నది తెలిసింది. అందుకే ఇప్పుడు ఆ రీమేక్ అసలు చేయాల్సింది కాదని చెబుతున్నాడు.;
యువ హీరోల్లో మాస్ ఇమేజ్ సంపాదించడం చాలా కష్టం. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం మొదటి సినిమా నుంచి కూడా మాస్ అప్పీల్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్నాడు. తను చేసిన సినిమాలు హిందీ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టాయి. ఆ క్రేజ్ తోనే హిందీలో సూపర్ హిట్ మూవీ ఛత్రపతి రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఐతే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ఐతే సినిమా చేశాక అతనికి అసలు నిజం ఏంటన్నది తెలిసింది. అందుకే ఇప్పుడు ఆ రీమేక్ అసలు చేయాల్సింది కాదని చెబుతున్నాడు.
త్వరలో భైరవం సినిమాతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఛత్రపతి రీమేక్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రాజమౌళి సినిమాలు అన్నీ కూడా ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఆ సినిమా వర్క్ అవుట్ అవుతుందని అనుకున్నాం కానీ ఆల్రెడీ మన సినిమాలు అక్కడ ఆడియన్స్ బాగా చూసి ఉన్నారు అందుకే అది వర్క్ అవుట్ కాలేదని అన్నారు. ఆ సినిమా షూటింగ్ టైం లోనే డౌట్ వచ్చింది.. అందుకే సినిమాకు 100 శాతం న్యాయం చేయలేకపోయానని అన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
ఇదే క్రమంలో ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ప్రభాస్ సినిమాలు రీమేక్ చేస్తా.. సూరీ సినిమాలు రీమేక్ చేస్తా అదే నా స్టైల్ అని అంటున్నాడు. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లా వెరైటీ సినిమాలు చేయాలని ఉందని వెల్లడించాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక తర్వాత తను చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి కంటెంట్ తో వస్తున్నాయని హైదవ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కిన భైరవం సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటుగా మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటించారు. కోలీవుడ్ లో సక్సెస్ అయిన గరుడన్ రీమేక్ గా భైరవం తెరకెక్కింది. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం భైరవం సినిమా మీద గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.