ట్రెండ్ ను ఫాలో అవుతున్న బాలయ్య.. 80స్ లుక్ లో దాదా!
సోషల్ మీడియా ప్రపంచాన్ని ప్రస్తుతం ఒక సరికొత్త నాస్టాల్జిక్ ట్రెండ్ ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ తెరిస్తే చాలు, సరిగ్గా నలభై ఏళ్ల కిందటి వైబ్ గుర్తుచేసేలా అచ్చం 1980ల నాటి వింటేజ్ చిత్రాలు కనువిందు చేస్తున్నాయి.
సోషల్ మీడియా ప్రపంచాన్ని ప్రస్తుతం ఒక సరికొత్త నాస్టాల్జిక్ ట్రెండ్ ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ తెరిస్తే చాలు, సరిగ్గా నలభై ఏళ్ల కిందటి వైబ్ గుర్తుచేసేలా అచ్చం 1980ల నాటి వింటేజ్ చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. '1980s AI Photo Trend' పేరుతో వైరల్ అవుతున్న ఈ క్రేజ్‌ను మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'దాదా' (DADA) పిక్స్ మరింత హీటెక్కించాయి. బాలయ్య వింటేజ్ గ్యాంగ్‌స్టర్ లుక్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.ఆ విశేషాలు చూద్దాం..
సోషల్ మీడియాను ఊపేస్తున్న ఏఐ ట్రెండ్:
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మ్యాజిక్‌తో పాతకాలపు జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందుకు వస్తున్నాయి. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ సాయంతో ఎలాంటి ప్రత్యేక నైపుణ్యం లేకుండానే తమ ఫోటోలను 80ల నాటి క్లాసిక్ రెట్రో లుక్‌లోకి మార్చేస్తున్నారు నెటిజన్లు. కేవలం ఒక ప్రోంప్ట్ ఇచ్చి క్షణాల్లో పాత సినిమాల హీరోల రేంజ్ వింటేజ్ ఫోటోలను తయారుచేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
'దాదా' లుక్‌తో బాలయ్య విధ్వంసం:
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం 'దాదా' టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది.ఇక ఈ సినిమాలో బాలయ్య 1980ల ముంబై బ్యాక్‌డ్రాప్‌లో, నోట్లో సిగార్, చేతిలో తుపాకీతో 'కింగ్ ఆఫ్ ఖోస్' గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్లే ఫ్యాన్స్ ఏఐ సాయంతో బాలయ్య కొత్త ఫోటోలను వింటేజ్ గ్యాంగ్‌స్టర్ వైబ్‌లోకి మార్చి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
వైట్ సూట్.. అంబాసిడర్ కార్ వైబ్:
నెట్టింట వైరల్ అవుతున్న ఏఐ పిక్స్‌లో బాలయ్య లుక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. 80ల నాటి ఆఫ్-వైట్ సూట్ బ్లేజర్, వైడ్-లేబుల్ బ్రౌన్ షర్ట్, మెడలో బంగారు గొలుసు, ఈగల్ బకిల్ బెల్ట్ ధరించి కనిపించారు. అంతేకాకుండా పాతకాలపు అంబాసిడర్ కార్ ముందుకు అనుకుని నిలబడిన ఈ పిక్స్ చూసి నందమూరి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. నిజమైన సినిమా స్టిల్స్ లాగే ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.
మొత్తానికి సాంకేతికత అందించిన ఈ ఏఐ ట్రెండ్‌ను సినీ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ బాలకృష్ణ మాస్ పవర్, గోపీచంద్ మలినేని మార్క్ వింటేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ కలగలసి రాబోతున్న 'దాదా' సినిమాపై ఈ ఏఐ పిక్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక 80ల నాటి ముంబై అండర్‌వరల్డ్ కథతో రాబోతున్న బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి..