• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య దబిడి దిబిడి...

బాలయ్య దబిడి దిబిడి ప్లాన్.. మోత మోగిపోవాల్సిందే..!

| ఆయన చేసేవి యాక్షన్ సినిమాలే అన్న టాక్ నుంచి యాక్షన్ తో పాటు ఈమధ్య కొన్ని స్పెషల్ స్టోరీస్ చేస్తూ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని మెప్పిస్తున్నాడు బాలకృష్ణ

By - Tupaki Desk
Update: 2025-05-07 18:21 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఆయన చేసేవి యాక్షన్ సినిమాలే అన్న టాక్ నుంచి యాక్షన్ తో పాటు ఈమధ్య కొన్ని స్పెషల్ స్టోరీస్ చేస్తూ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని మెప్పిస్తున్నాడు బాలకృష్ణ. రీసెంట్ గా డాకు మహారాజ్ తో వచ్చి అలరించిన బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాలయ్య, బోయపాటి ఈ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. అదీగాక అఖండ సూపర్ హిట్ తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 పై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే బాలయ్య అఖండ 2 తర్వాత మరోసారి గోపీచంద్ మలినేనితో సినిమా లాక్ చేసుకున్నాడు. వీర సింహా రెడ్డి తర్వాత గోపీచంద్ తో మళ్లీ బాలయ్య సినిమా రెడీ అవుతుంది. ఐతే ఆ సినిమా తర్వాత మళ్లీ మరో సూపర్ హిట్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. బాలకృష్ణతో భగవంత్ కేసరి అనే సినిమా తీసి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరి కాంబో సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఐతే అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. 2026 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో ఆ సినిమా వస్తుంది. ఐతే ఆ తర్వాత వెంకటేష్ తో F4 చేయాలనే ప్లాన్ ఉందట. ఐతే దానితో పాటు బాలకృష్ణ సినిమా కూడా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ముందు వెంకటేష్ తోనా, బాలకృష్ణ సినిమా అన్నది తెలియదు కానీ కచ్చితంగా మళ్లీ బాలయ్య తో అనిల్ సినిమా మాత్రం ఫిక్స్ అని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ చెబుతున్నాయి.

స్టార్ డైరెక్టర్ గా అసలు ఫెయిల్యూస్ లేని అనిల్ రావిపూడి పటాస్ నుంచి రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం వరకు అదరగొట్టేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ సినిమా కథ సిద్ధం చేసి హీరోని కూడా ఓకే చేసుకుంటున్నాడు అనిల్. ప్రస్తుతం ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడమే కష్టం అనుకుంటుంటే డైరెక్టర్ గా అనిల్ ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తూ ఆ సినిమాలతో సక్సెస్ కూడా కొడుతున్నాడు. సో బాలయ్యతో అనిల్ ఈసారి భగవంత్ కేసరి కాదు దానికి మించి సినిమా తీసేలా ప్లాన్ ఉంటుందని తెలుస్తుంది.

Tags:    
  • Balakrishna 
  • Akhanda2 
  • AnilRavipudi 
  • Tollywood 
  • BoyapatiSrinu 
  • GopichandMalineni 
  • SouthIndianCinema 

Similar News

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

Copyright @2026

Powered by Blink CMS